తెలంగాణకు భారీ వర్ష సూచన...!

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రానున్న మూడు రోజుల పాటు వానలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

 Heavy Rain Forecast For Telangana...!-TeluguStop.com

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.కాగా బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడింది.

ఇది రేపు అల్పపీడనంగా మారి మరుసటి రోజు వాయుగుండంగా మారనుంది.వాయుగుండం ఉత్తరదిశగా పయనిస్తూ తీవ్రమైన తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube