ఇక్కడ పేటియం( Paytm ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పుడంటే చాలామంది ఫోన్ పే, గూగుల్ పే ద్వారా లావాదేవీలు నెరుపుతున్నారు గాని, ఇవి రాకమునుపే పేటియం రాజ్యమేలింది.
అందుకే పేటియం గురించి తెలియనివారు ఇక్కడ దాదాపుగా తెలియనివారు వుండరు.ఇంకా ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ కూడా ఉండదు.
అయితే ఫోన్ పే, గూగుల్ పే వచ్చాక పేటియం హవా కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి.అందుకే పేటియం ఇపుడు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ తన ఉనికిని చాటుకొనే పనిలో పడింది.

ఈ క్రమంలోనే పేటియం తన కొత్త టెక్ ప్లాట్‌ఫారమ్‌లో కృత్రిమ మేధస్సును(AI)( Artificial intelligence ) ఉపయోగించనుంది.దీని ద్వారా మోసాలను గుర్తించడం, కస్టమర్ కేర్ సర్వీస్‌లను మెరుగుపరచడం వంటి సేవలు పొందవచ్చు.గత ఏడాది కాలంగా దీని కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ( Vijay Shekhar Sharma ) తాజాగా ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

కొత్త టెక్ ప్లాట్‌ఫారమ్ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడిందని, ప్రస్తుత లావాదేవీల సంఖ్య కంటే 10 రెట్లు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు.

ఇకపోతే పేటియం ఆదాయం విషయానికొస్తే మార్చి త్రైమాసికంలో 52 శాతం పెరిగి, రూ.2,335 కోట్లకు చేరుకుంది.ఈ క్రమంలో నష్టం రూ.763 కోట్ల నుంచి రూ.168 కోట్లకు తగ్గడం గమనార్హం.ఇక చెల్లింపుల సేవల ఆదాయం 41 శాతం పెరిగి రూ.1,467 కోట్లకు చేరుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.స్థూల వ్యాపార విలువ (GMV) 2023 ఆర్థిక సంవత్సరం క్యూ4లో 40 శాతం పెరిగి రూ.3.62 లక్షల కోట్లకు చేరుకుంది.







