Regina Cassandra: బోలెడంత ట్యాలెంట్ ఉంది అయినా కూడా ఆవగింజంత అదృష్టం లేదుగా ?

రెజీనా కసాండ్రా.( Regina Cassandra ) స్వతహాగా తమిళ నటి అయినా రెజీనా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలుగుతుంది అని అంతా భావించారు.

 What Happened To Regina Cassandra-TeluguStop.com

కానీ ఆమె ఏ కారణం చేత తెలుగు లో బిజీ కావడం లేదో అర్ధం కావడం లేదు కానీ రెజీనాకు బోలెడంత ట్యాలెంట్ ఉంది అని మాత్రం టాలీవుడ్ లో అనుకుంటూ ఉంటారు.తెలుగు లో ఒక హీరో తో ప్రేమలో పడి విఫలం కావడమే ఒక కారణం అని కూడా గుసగుసలు వినిపిస్తాయి.

ప్రస్తుతం రెజీనా చేతిలో ఈ ఏడాది 4 సినిమాలు ఉన్నాయ్.అందులో ఒక్కటి కూడా తెలుగు సినిమా కాదు.అన్ని తమిళ సినిమాలే ప్రస్తుతం ఆమె చేస్తుంది.ఇక సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా రెజీనా బిజీ గా ఉంది.

కాగా ఆమె ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లలో నటించడం వల్ల ప్యాన్ ఇండియా వ్యాప్తంగా బాగానే పాపులారిటీ తెచ్చుకుంటుంది.కానీ ఎటొచ్చి ఆమె తెలుగు లో మాత్రం బిజీ అవ్వలేక పోతుంది.

Telugu Acharya, Reginacassandra, Saakini Daakini, Tollywood-Movie

రెజీనా చివరగా శాకినీ డాకిని( Saakini Daakini Movie ) అనే సినిమాలో మెయిన్ లీడ్ చేసిన అది పెద్దగా ఉపయోగపడలేదు.ఇక ఎవరు సినిమా తర్వాత ఆచార్య లో( Acharya Movie ) సాన కష్టం అనే పాటలో కనిపించిన రెజీనా ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు.మరి ఇప్పట్లో ఆమె తెలుగు చిత్రాల్లో కనిపించే అవకాశం కూడా ఎక్కడ కనిపించడం లేదు.రెండు వెబ్ సిరీస్ ల నాలుగు తమిళ్ సినిమాల్లో కనిపిస్తున్న ఆమె వీటిని పూర్తి చేయానికి మరొక రెండేళ్లు టైం తీసుకోవచ్చు.

Telugu Acharya, Reginacassandra, Saakini Daakini, Tollywood-Movie

మరి అన్ని రోజుల పాటు ఆమెను తెలుగు వారు గుతుంచుకోవడం అనేది ఉండదు.అందువల్లే దాదాపు ఆమె కెరీర్ తెలుగు లో ముగిసినట్టే అంటుకుంటున్నారు.పోనీ ఏదైనా పెద్ద సినిమాలో కనిపిస్తుందా అది కూడా కష్టమే.తెలుగు చాల చక్కగా మాట్లాడే రెజీనా తెలుగు బిజీ ఆర్టిస్ట్ గా లేకపోవడం నిజంగా బాధాకరం.

ఇక పోతే ఈ 32 ఏళ్ళ చిన్నది తెలుగు లో తొలిసారి నటించిన శివ మనసులో శృతి సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది.మరి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మరోమారు తెలుగు లో బాగుండాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube