1.తెలంగాణ వాసులకు అలర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడి అది ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం ఉందని , ఈ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు( Heavy Rains ) పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
2.ప్రైవేట్ స్కూళ్ళల్లో అనుమతులు కోసం కొత్త విధానం
ప్రైవేటు స్కూళ్ల అనుమతుల కోసం కొత్త విధానాన్ని ఏపీ ప్రభుత్వం( AP Government ) తీసుకొచ్చింది.దీనికోసం ప్రత్యేక పోర్టల్ ను రూపొందించింది.
3.కర్ణాటకలో ప్రధాని రోడ్ షో

ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) బెంగళూరు నగరంలో మెగా రోడ్ షో నిర్వహించారు.
4.చంద్రబాబును అరెస్ట్ చేస్తారు
అవినీతిపరుడైన చంద్రబాబుని అరెస్టు చేస్తారు అంటూ ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరావు అన్నారు.
5.ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
ధాన్యం కొనుగోలు జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
6.రాజాసింగ్ ఆగ్రహం
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్( MLA Raja Singh ) కు సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. కొత్త సచివాలయంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.దీనిపై రాజా సింగ్ సీరియస్ అయ్యారు.
7.మణిపూర్ లో హింస.54 మంది మృతి

గిరిజన , గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో, మణిపూర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది .ఈ ఘర్షణలో 54 మంది మృతి చెందారు.
8.చంద్రబాబు దొంగ పర్యటనలు
టిడిపి అధినేత చంద్రబాబువి దొంగ పర్యటనలని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
9.ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) విడుదల చేశారు.
10.చంద్రబాబుకు రాజమండ్రి ఎంపీ సవాల్

టిడిపి అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu )కు రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ చేశారు.దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానంటూ మహానాడులో చెప్పగలవా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు.
11.సిపిఐ రామకృష్ణ విమర్శలు
విశాఖ స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వెనక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
12.కర్ణాటక ఎన్నికల ప్రచారంలోకి సోనియా
కర్ణాటక ఎన్నికల ప్రచారంలోకి సోనియా గాంధీ రానున్నారు.బెల్గావి , హుబ్లీలో రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేయనున్నారు.
13.నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది .రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని , క్రమేపి బలపడి తుఫాన్ గా మారుతుందని ఐఎండి అంచన వేస్తోంది.9 ,10 తేదీల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
11.మంత్రి కేటీఆర్ పర్యటన

నేడు మహబూబ్నగర్ లో ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఐటీ క్యారిడార్ శిల్పారామం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.
12.గుంటూరు లో ఐపీఎల్ మ్యాచ్ల ప్రదర్శన
గుంటూరులో నేడు ఎల్ఈఎం గ్రౌండ్ లో ఐపీఎల్ మ్యాచ్ ను డిజిటల్ స్క్రీన్లతో ఐపిఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసిన బీసీసీఐసీ.
13.ఖమ్మంలో రైతు భరోసా ర్యాలీ

నేడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా ర్యాలీ( Rythu Barosa Rally )ని, ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లమీద కలెక్టరేట్ వరకు నిర్వహించారు.పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
14.వైభవంగా ద్వారకా తిరుమలేసుడి కళ్యాణం
ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.
15.బిజెపి హిందూ ఏక్తా యాత్ర
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 14న కరీంనగర్( Karimnagar ) లో హిందూ యాత్రను నిర్వహించినట్లు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
16.మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా సంఘాలకు వడ్డీ లేని భారీ మొత్తంలో రుణాలు ఇస్తామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు.
17.ఏపీ ప్రభుత్వంపై పురందరేశ్వరి విమర్శలు

రాష్ట్రంలో ఎస్సీల భూములు లాక్కుని జగనన్న కాలనీయలుగా మారుస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి( Daggubati Purandeswari ) విమర్శించారు.
18.ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయాలి
చట్ట వ్యతిరేకంగా ఉన్న ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయాలని డీలర్ల సంఘం నాయకులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కోరారు.
19.ఏపీలో డీఎస్పీల బదిలీలు
ఏపీలో 50 మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు.ఈ మేరకు డిజిపి రాజేందర్ నాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,500
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 61,640
.






