మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో కిచెన్ కేబినెట్ ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని గోనె జోస్యం చెప్పారు.టీడీపీకి ఒంటరిగా వంద సీట్లు వస్తాయని తెలిపారు.
తిరుపతిలో తాను చేసిన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.రెండు రాష్ట్రాల్లోనూ దోపిడీ పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.
మాజీ మంత్రి బాలినేని జూదం ఆడటం వలన అప్పులు మిగిలాయన్నారు.బాలినేని సీఎం జగన్ ను కలిసి అబద్ధపు అప్పుల చిట్టా ఇచ్చారని విమర్శించారు.
సీఎం జగన్ జైలుకు వెళ్లే అవకాశం లేదన్నారు.కంపెనీలు, పెట్టుబడులకు సంబంధించి జగన్ కు ఫైన్ పడే అవకాశం ఉందని తెలిపారు.
వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని వ్యాఖ్యనించారు.







