కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కన్నడ నాట ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా బెంగళూరు రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
మొత్తం 26 కిలోమీటర్ల మేర మోడీ రోడ్ షో కొనసాగనుంది.సోమేశ్వర సభ భవన్ నుంచి సంపీజీ రోడ్ మల్లేశ్వరం వరకు ఈ రోడ్ షో నిర్వహించనున్నారు.
అటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే సోనియా గాంధీ హుబ్లీ ఎన్నికల సభలో పాల్గొననున్నారు.
దీంతో కన్నడ నాట పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.