Dhavala Satyam: ఆ సినిమాలో చిరంజీవిని హీరోగా వద్దని చెప్పిన దాసరి నారాయణరావు.. చివరకు?

సీనియర్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ ధవళ సత్యం( Dhavala Sathyam ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో 45 ఏళ్ల సినీ కెరియర్ లో 23 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు సత్యం.

 Dasari Narayana Asked To Remove Chiranjeevi As Hero Says Dhavala Satyam-TeluguStop.com

తన కెరియర్ లో ఎంతోమంది దిగ్గజాలతో కలిసి పనిచేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధవళ సత్యం ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన గురువు దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) ఏ విధంగా అయితే రైటర్ గా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా రాణించారో తాను కూడా అదేవిధంగా తన స్టైల్ నే ఫాలో అయినట్లు తెలిపారు.

Telugu Chandra Mohan, Chiranjeevi, Dasari Yana, Dhavala Sathyam, Dhavalasathyam,

1978లో విడుదలైన జాతర సినిమాతో( Jathara Movie ) డైరెక్టర్ గా మారారు ధవళ సత్యం.ఈ సినిమాలో చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించారు.ఈ సినిమా హీరో ఎంపిక విషయంలో దాసరి నారాయణరావు అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు సత్యం.ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.1978లో జాతర సినిమాని మొదలుపెట్టాము.కానీ హీరో క్యారెక్టర్ విషయంలో కాస్త సందిగ్ధం ఏర్పడింది.నేను చిరంజీవిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాను.ఎందుకంటే అతని ఫేస్‌లో, లుక్స్‌లో నాకు ఫ్లేర్ కనిపించేది.కానీ మా గురువు గారు దాసరి మాత్రం నీకు దర్శకుడిగా మొదటి సినిమానే కదా హీరోగా కూడా కొత్తవాడైన చిరంజీవిని ఎందుకు తీసుకున్నావ్ అని అన్నారు.

Telugu Chandra Mohan, Chiranjeevi, Dasari Yana, Dhavala Sathyam, Dhavalasathyam,

పైగా ఆ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజు, కెమెరామ్యాన్ ఉదయరాజు కొత్తవారే.అంతేకాదు లక్ష్మీపతి రాజుకు ప్రొడక్షన్ ఫస్ట టైమ్, జనార్ధన్ రావుకు నిర్మాతగా మొదటి సినిమానే.కాబట్టి హీరో అయినా ఎక్స్‌పీరియన్స్ అయితే బెటర్ అన్నారు దాసరి.మన దగ్గర ఎవరి డేట్లు ఉన్నాయో చూడండని స్టాఫ్‌కు చెప్తూ చిరంజీవిని తీసేని చివరకు చంద్ర మోహన్‌ను పెట్టేద్దామని అన్నారు అంటూ ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు సత్యం.

  కానీ చివరికి సత్యం చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీయగా ఆ సినిమా అప్పట్లో విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇకపోతే హీరో మెగాస్టార్ విషయానికి వస్తే.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube