Niharika Santosh Sobhan : ఆ యంగ్ హీరోతో అదిరిపోయే స్టెప్పులు వేసిన నిహారిక.. వీడియో వైరల్?

తెలుగు ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక( Niharika Konidela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది.

 Niharika Konidela Dances With Gracefully Santosh Sobhan Watch Video-TeluguStop.com

హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలో అంతగా సక్సెస్ కాలేదు.హీరోయిన్ అవ్వడం కోసం నిహారిక ఇంట్లో అందర్నీ ఎదురించి మరి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.

కానీ వెండితెర ఆమెకు అంతగా కలిసి రాలేదు.ఢీ షోకీ యాంకర్ గా వ్యవహరిస్తూ బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది నిహారిక.

ఇక హీరోయిన్ గా ఈమె చెస్ కాకపోవడంతో ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా నిహారిక, చైతన్య( Chaitanya Jv ) ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలపై అటు చైతన్య ఫ్యామిలీ కానీ ఇటు నిహారిక ఫ్యామిలీ కానీ స్పందించడం లేదు.పెళ్లి అయినప్పటికీ నిహారిక తన అల్లరిని ఏ మాత్రం తగ్గించలేదు.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.పెళ్లి తర్వాత నిర్మాతగా మారిన ఈమె పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ అనే ప్రొడక్షన్‌ బ్యానర్‌ ను స్థాపించి సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల కోసం కథలు వింటోంది.ఇదిలా ఉంటే తాజాగా నిహారిక టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్‌ తో కలిసి స్టెప్పులు వేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ ( Santosh Sobhan )హీరోగా నటించిన అన్ని మంచి శకునములే సినిమా మే 18న విడుదల కానుంది.ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నిహారికతో కలిసి స్టెప్పులు వేశాడు సంతోష్ శోభన్.ఈ సినిమాలోని మెరిసే మబ్బుల్లో సాంగుకు ఇద్దరు కలిసి స్టెప్పులు వేశారు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube