నెల్లూరు పాలిటిక్స్ ! చేరికలతో చక్రం తిప్పుతున్న వైసీపీ సీనియర్

వైసిపికి ( YCP ) కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ స్వీప్ చేసింది.పది మంది వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.అయితే ఊహించని విధంగా ముగ్గురు పార్టీకి రెబల్ గా మారారు.ఇటీవల వైసిపి ప్రభుత్వం పైన, జగన్ పైన బహిరంగంగా విమర్శలు చేసి జగన్ ( CM Jagan ) ఆగ్రహానికి గురయ్యారు.వెంటనే వారిపై బహిష్కరణ వేటు పడింది.

 Ycp Senior Leader Mekapati Rajamohan Reddy Playing Key Role In Nellore Politics-TeluguStop.com

ఆ లిస్టులో జగన్ కు వీర విధేయుడుగా పేరుపొందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.అయితే ఆనం రామనారాయణరెడ్డి ఒక్కరే పార్టీ వీడుతారని అంతా ముందు నుంచి ఊహిస్తూనే వచ్చినా, అనూహ్యంగా చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆ బాటలోనే వెళ్లారు.

ఈ నేపద్యంలో నెల్లూరు జిల్లాలో వైసిపి వీక్ అయిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, వైసిపి సీనియర్ నేత మాజీ ఎంపీ మేకపాటి రాజా మోహన్ రెడ్డి( Mekapati Rajamohan Reddy ) రంగంలోకి దిగారు.పార్టీలో చేరికలను ప్రోత్సహించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

రాజమోహన్ రెడ్డి రెండో కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి సహకారంతో చేరికలపై దృష్టి సారించారు.వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లిన సీనియర్ నాయకులను, టిడిపిలో అసంతృప్తితో ఉన్నవారిని మళ్లీ వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు రాజా మోహన్ రెడ్డి చేస్తున్నారు.

Telugu Anamramnarayana, Ap Cm Jagan, Jagan, Kotamreddy, Mekapativikram, Nelluru,

దీనిలో భాగంగానే నెల్లూరు మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, ( Bommireddy Raghavender Reddy ) తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.అలాగే ఆత్మకూరు మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్, టిడిపి నేత ఇందూరు వెంకటరమణారెడ్డి వైసీపీలో చేరారు.ఇంకా మరి కొంతమంది టిడిపి కీలక నేతలను వైసీపీలో చేర్చుకునే వ్యూహానికి రాజా మోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కి ఆత్మకూరు టికెట్ ఇప్పిస్తున్నారనే ప్రచారం కూడా నెల్లూరు రాజకీయాల్లో జరుగుతోంది.

Telugu Anamramnarayana, Ap Cm Jagan, Jagan, Kotamreddy, Mekapativikram, Nelluru,

ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట.ఇక నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట.దీంతో నెల్లూరు ఎంపీగా సీనియర్ నేత రాజా మోహన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.2019 ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేసినా, ఈ నియోజకవర్గంలో పరిస్థితులు వైసీపీకి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో, మేకపాటి రాజా మోహన్ రెడ్డి చక్రం తిప్పుతూ, మళ్లీ 2024 ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేసే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube