, కర్ణాటకలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది.ఈనెల 10వ తేదీన పోలింగ్ జరగబోతుండడంతో, అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఆసక్తి పెరిగిపోతోంది.జనం నాడిని పసిగట్టి దానికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేపడుతూ, జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఏ పార్టీకి ఆ పార్టీ పెద్ద ఎత్తున ఉచిత పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి తమ పార్టీ వైపు జనాలు చూపు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇక ఈరోజు రేపు బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోది రోడ్ షో నిర్వహించబోతున్నారు.ప్రధాని మోది( Narendra Modi ) ఎన్నికల ప్రచారంలోకి ఇప్పటికే రావడం, ప్రధాని నరేంద్ర మోది కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడం వంటివి జరిగాయి.కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ( Rahul Gandhi ) తో పాటు, ఆ పార్టీలోని కీలక నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇదిలా ఉంటే తాజాగా వెలువడిన ఓ సర్వే ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉండడంతో, పార్టీలో ఉత్సాహం నెలకొంది .
పోలింగ్ సమయం దగ్గర పడిన సమయంలో జన్ కి బాత్ – సువర్ణ న్యూస్ ( కన్నడ )( Jan Ki Baat ) రెండో విడత సర్వే ఫలితాలు విడుదల చేసింది.ఈ సర్వేలో మళ్ళీ కర్ణాటకలో బిజెపికి సంపూర్ణ మెజారిటీ వచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా తేల్చింది.అంతేకాదు సొంతంగా బిజెపి అధికారంలోకి వస్తుందని సర్వే నివేదికలో వెల్లడించారు.
ఒకవేళ బిజెపి అధికారంలోకి రాకపోయినా, బీజేపీ మాత్రమే అతిపెద్ద పార్టీగా కర్ణాటకలో అవతరిస్తుందని ఆ సర్వే నివేదిక తేల్చడంతో బిజెపి శ్రేణుల్లో ఆనందం నెలకొంది.జన్ కి బాత్ – సువర్ణ న్యూస్ మొదట జరిగిన సర్వేలో బిజెపికి 98 నుంచి 119 స్థానాలు వస్తాయని పేర్కొంది.
కానీ ఏప్రిల్ 29 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో విస్తృతంగా పర్యటించడం , కాంగ్రెస్ విమర్శలతో విరుచుకు పడడం, జనాల్లోనూ దీనిపై చర్చ జరగడంతో ఫలితాలు తారుమారయ్యాయని, కాంగ్రెస్ ను దాటుకుని బిజెపి ముందంజలో ఉందని తాజా సర్వే నివేదిక వెల్లడించింది.
ప్రధాని మోదీ కళ్యాణ కర్ణాటక ,పాత మైసూరు, ఖరవల్లి కర్ణాటక , మధ్య కర్ణాటక ప్రాంతాల్లో రోడ్డు షోలు బహిరంగ సభలు నిర్వహించారు.మోదీ పర్యటన తరువాత బిజెపికి అనుకూలంగా మారిందని సర్వే తేల్చింది.కర్ణాటకలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, 113 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం.
బిజెపికి 114 సీట్లు వస్తాయని సర్వే తేల్చడంతో బిజెపిలో ఉత్సాహం కనిపిస్తుంది.అలాగే కాంగ్రెస్ కు 86 నుంచి 98 సీట్లు, జెడిఎస్ కు 20 నుంచి 26 సీట్లు ఇతరులకు 0 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే నివేదిక బయటకు వచ్చింది.
ఇదంతా ప్రధాని మోదీ ఎఫెక్ట్ గానే కర్ణాటక బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.