శనివారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించబోతున్న చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు( Chandrababu naidu ) మరోసారి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించడానికి రెడీ అయ్యారు.ఇటీవల అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను మరియు నష్టపోయిన రైతులను తణుకు మండలంలో కొద్దిరోజుల క్రితం చంద్రబాబు పరామర్శించడం జరిగింది.

 Chandrababu Is Going To Visit Nidadaolu Constituency On Saturday , Tdp, Chandra-TeluguStop.com

అయితే ఈసారి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నిడదవోలు నియోజకవర్గం( Nidadaolu constituency ) మీదుగా కంసాలి పాలెం, సింగవరం గ్రామాల్లో పర్యటించబోతున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావు తెలియజేశారు.తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం చంద్రబాబు నష్టపోయిన రైతులను పరామర్శించడం జరిగింది.

ఆ సమయంలో రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని సీఎం జగన్( CM jagan ) పై ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని.కోరారు.రైతుకు న్యాయం జరిగే వరకూ పార్టీ అండగా ఉంటుందని.భరోసా ఇచ్చారు.దీంతో పార్టీ అధినేత రాక నేపధ్యంలో భారీ ఎత్తున ఘన స్వాగతం పలకడానికి.

జిల్లా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.మరోపక్కన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి.

నిరసన దీక్షలు చేపట్టడానికి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube