మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల( Electric Vehicles ) హవా నడుస్తోంది.ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.
దీనికి ప్రధాన కారణం పెట్రోల్ ధరలు భారీగా పెరగడమే.మరొక విషయం ఏమిటంటే.? నగర పరిధిలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు( Electric Scooters ) సౌకర్యవంతంగా ఉంటాయి.ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న బైక్ తయారీ సంస్థలు, సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ బైక్ గో కంపెనీ రగ్గడ్ జీ1( Rugged G1 ) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లోకి విడుదల చేసింది.దీని ఫీచర్స్ ఏమిటో చూద్దాం.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు చూస్తే పిట్ట కొంచెం కూత గణం అన్నట్టుగా.అధిక సామర్థ్యం కలిగి ఉంది.ఈ రగ్గడ్ జీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి మోపెడ్ ను పోలి ఉంటుంది.ఇది చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తూ అధిక పవర్ ఔట్ పుట్ అందిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపుగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మహిళలకు, వృద్ధులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఏ వయసులో ఉండే వ్యక్తులైన కూడా సులభంగా నడపవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 1.9 kWh సామర్థ్యం కలిగి ఉంది.గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
దీనిలో 1500 వాట్ల సామర్థ్యంతో బీఎల్డీసీ మోటర్ ఉంటుంది.దీని మోటారుకు అధిక సామర్థ్యం ఉండడంతో నగరాలలోనైనా, పల్లె ప్రాంతాలలో నైనా, ఎత్తు గల ప్రాంతాలలోనైనా సులువుగా నడపవచ్చు.
అధిక బరువును కూడా మోయగలుగుతుంది.ఈ రగ్గడ్ జీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.
ఇది రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది.దీన్ని ఎక్స్ షోరూం ధర రూ.78,498 నుంచి రూ.1,02,514 వరకు ఉంది.







