శాకుంతలం( Sakunthalam ) సినిమాతో అల్లు అర్హ( Allu Arha ) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగిన సమయంలో అల్లు ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు.అల్లు అర్హ తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి మరిన్ని సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావించారు.
అయితే శాకుంతలం సినిమాలో అర్హ అభినయానికి ప్రశంసలు దక్కినా సినిమా మాత్రం అంచనాలను అందుకోలేదు.ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డే సైతం ఫిక్స్ అయింది.

మే నెల 12వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.శాకుంతలం సినిమా ఫ్లాప్ సమంతను కూడా హర్ట్ చేసిందని బోగట్టా.సమంత దిల్ రాజు బలవంతం వల్లే ఈ సినిమాకు అంగీకరించింది.అయితే దిల్ రాజు సమంత కాంబినేషన్ కూడా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కాదు.ఈ కాంబోలో తెరకెక్కిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

అయితే అల్లు అర్హకు శాకుంతలం సినిమాలో ఛాన్స్ వస్తే బన్నీ వెంటనే ఓకే చెప్పారు.అయితే జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) మాత్రం తన పిల్లలకు సినిమాలలో ఛాన్స్ వస్తున్నా వెంటనే ఎస్ చెప్పడం లేదు.తన పిల్లలు ఇప్పుడే సినిమాల్లోకి రారని క్లారిటీగా చెప్పేస్తున్నారు.
అందువల్ల దర్శకనిర్మాతలు సైతం ఎన్టీఆర్ పిల్లలను సినిమాల్లోకి తీసుకోవడం లేదు.తన సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ కు సైతం తన కొడుకులను తీసుకోవాలని తారక్ భావించడం లేదు.
చిన్నతనంలోనే సినిమాలలో నటించడం వల్ల ఆయా పిల్లల కెరీర్ పై సినిమాటిక్ ప్రభావం పడి ఆ తర్వాత కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
ఎన్టీఆర్ క్రేజ్ పరంగా ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.







