ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది.అలాగే దర్శకులకు కూడా ఒక రోజు ఉందట.
దానిని డైరెక్టర్స్ డే( Directors Day ) అని పిలుస్తున్నారు.తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ దర్శకుల సంఘం డైరెక్టర్స్ డే రోజున కొంతమంది డైరెక్టర్ల పేర్లతో పురస్కారాలను ప్రకటించింది.
ప్రతి అసోసియేషన్ తమ ఉనికిని చాటుకోవడానికి ఇలా కొన్ని అవార్డులను పురస్కారాలను ప్రకటించడం చాలా మామూలే.అయితే చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న దర్శకుల సంఘం కొత్తగా ఏదో చేయాలని ప్రయత్నిస్తూ నవ్వుల పాలయ్యే ఒక పని చేసింది.
వారు ఎలా ఉన్నా జరిగే నష్టం లేదు కానీ వారి పురస్కారాల పేరుతో బలగం సినిమా దర్శకుడు వేణు ని( Balagam Director Venu ) దారుణంగా అవమానించారు.వీరు అసలు ఎలా అవార్డులిస్తారో, ఎక్కడ ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ కొంతమంది టాలెంట్ ఉన్నా మరియు ప్రతిభావంతులైన దర్శకులను ఎంపిక చేసి ఒక ఫోటో ద్వారా వారిని ప్రకటించారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఎంపిక చేసిన డైరెక్టర్ లిస్టులోనే ప్రాబ్లం ఉంది.కార్తికేయ, బింబిసారా, నాట్యం, విరాట పర్వం, కలర్ ఫోటో, బలగం చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుల ఫోటోలతో పాటు వారి సినిమాల పేర్లు ఈ ప్రకటనలో ఉన్నాయి.అయితే ఈ ఆరు సినిమాలలో బలగం సినిమా( Balagam Movie ) మినహా మిగతా సినిమాల దర్శకుల పేర్లను ఆ సినిమాలను ప్రకటించిన ఈ సంఘం ఒక బలగం సినిమా పేరు కింద మాత్రం దర్శకుడి పేరుకు బదులు నిర్మాత దిల్ రాజు కాంపౌండ్ నుంచి హర్షిత్ రెడ్డి ఫోటో వేశారు.ఈ బలగం సినిమాకు దర్శకుడు వేణు అనే విషయం అందరికీ తెలుసు.
ఇలాంటి వ్యక్తి పేరు వేసి దర్శకుల రోజు నాడు ఇంతలా వేణుని అవమానించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న వినిపిస్తుంది.
పైగా మిగతా సినిమాలతో పోలిస్తే బలగం సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది.ఈ సినిమాను పల్లె పల్లెనా ప్రేక్షకులు జనాలు ఓన్ చేసుకున్నారు.తెలంగాణ బిడ్డ వేణు మంచి సినిమా తీశాడు అని అందరూ అతడిని ఎంతగానో అభిమానిస్తున్నారు.
ఇక ప్రకటించిన సినిమాల విషయానికొస్తే నాట్యం విరాటపర్వం రెండు ఫ్లాప్ అయిన సంగతి మనకు తెలుసు కార్తికేయ ఓ మాదిరిగా నడిచింది.బింబిసారా, కార్తికేయ కమర్షియల్ సినిమాలు.
ఇన్ని సినిమాల మధ్య ఏకైక ప్రజల మెప్పు పొందిన సినిమా అంటే బలగం మాత్రమే.మరి దిల్ రాజు పైత్యం కారణమా లేక దర్శకుల సంఘం అవివేకం కారణమా తెలియదు కానీ బలగం సినిమా దర్శకుడు పేరు స్థానంలో నిర్మాత పేరు వేసి అవమానించడం ద్వారా వారు పొందిన ఘనత ఏంటో అర్థం కావడం లేదు.