మే 5వ తేదీన శుక్రవారం రోజు ఏర్పడే అరుదైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం( Penumbral lunar eclipse ) రాత్రి 8 గంటల 44 నిమిషములకు మొదలై అదే రోజు రాత్రి 1.01 నిమిషములకు ముగిసిపోతుంది.చంద్రగ్రహణం కారణంగా అనేక దేవాలయాలు మూసివేస్తారు. చంద్రగ్రహణం( lunar eclipse ) రోజు ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని పండితులు చెబుతున్నారు.గ్రహణాలు ఏవైనా అవి మానవ జీవితాల పై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని అందుకే గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై గరిక దర్భలను ఉంచాలని సూచిస్తున్నారు.
గ్రహణ సమయంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులను బట్టి భూమి మీద పడే కిరణాలు మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.అందుకే గ్రహణ క్రమంలో ఎవరు బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు.
అంతేకాకుండా గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై గరికను వేసుకోవాలని చెబుతున్నారు.అలా వేయకుండా గ్రహణా సమయంలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అందుకే గ్రహణా సమయంలో ఆహారంపై గరిక దర్భలను వేసి గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని, ఆ తర్వాత మాత్రమే ఆహార పదార్థాలను తినాలని చెబుతున్నారు.
గ్రహణ సమయంలో గరిక దర్భలను ఆహారంపై ఎందుకు వేస్తారో దాని వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎందుకంటే గ్రహణ సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది.ఈ కిరణాలు పడినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
అందుకే ఈ సమయంలో పనిచేయకూడదని, ఆహార పదార్థాలను ముట్టుకోకూడదని చెబుతూ ఉంటారు.ఇక ఆహార పదార్థాలపై గరిక దర్భలను వేయడంలో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
ఆహార పదార్థాలలో గరిక దర్భలను వేయడం వల్ల గ్రహణ ప్రభావం వల్ల వచ్చే కిరణాల ప్రభావం పచ్చని గరిక దర్భలు లాక్కుంటాయి.గరిక దర్భలు అతీనిల లోహిత కిరణాలను తమ లోనికి తీసుకొని వాటి ప్రభావం ఆహారం పై పడకుండా చేస్తాయి.
కాబట్టి గ్రహణ సమయంలో కచ్చితంగా ఆహార పదార్థాలపై పచ్చళ్లపై గరిక దర్భలను ఉంచాలని పండితులు చెబుతున్నారు.