Rambanam Review: రామబాణం రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ శ్రీవాస్( Director Sriwass ) దర్శకత్వంలో రూపొందిన సినిమా రామబాణం.( Ramabanam ) ఇందులో గోపిచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, కుష్బూ కీలకపాత్రలో చేయగా సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య తదితరులు నటించారు.

 Rambanam Review: రామబాణం రివ్యూ: సినిమా -TeluguStop.com

ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా.

వెట్రి పలని స్వామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకోగా ఎటువంటి టాక్ వస్తుందో అన్న ఆలోచనలో ఉన్నారు.

ఇక ఇప్పటికే గత కొంతకాలం నుండి గోపీచంద్ కు( Gopichand ) అసలు కలిసి రావడం లేదు.ఈ మధ్య సరైన సక్సెస్ అనేది కొట్టలేకపోతున్నాడు.

ఇక ఆయన ఆశలన్నీ ఇప్పుడు రామబాణం సినిమాపై ఉండగా ఈ సినిమా ఈరోజు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.అంతేకాకుండా గోపీచంద్ కు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రూపొందింది అని చెప్పాలి.ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అనుబంధంతో ఈ సినిమాను అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.కార్పొరేట్ మాఫీయా నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కించగా.ఇందులో కార్పొరేట్ మాఫియా రూపంలో కుటుంబానికి ఎదురైన కష్టాలను హీరో కాపాడుకుంటాడు.

అయితే ఆ సమయంలో ఆ హీరో ఎదుర్కొనే అడ్డంకులు, చివరికి వారిని ఎలా కాపాడుతాడు అనేది మిగిలిన కథలోనిది.

Telugu Dimple Hayati, Gopichand, Jagapathi Babu, Kushboo, Ramabanam, Ramabanam S

నటినటుల నటన:

గోపీచంద్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.క్లాస్ సినిమా కైనా మాస్ సినిమా కైనా అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేస్తాడు.ఇక ఈ సినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

జగపతిబాబు కూడా అద్భుతంగా నటించాడు.ఇక డింపుల్ హయాతి, ఖుష్బూ, వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు తమ పాత్రలతో నవ్వించడమే కాకుండా పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ ఈ సినిమాకు మంచి కథను అందించాడు.ముఖ్యంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఆల్ మిక్స్డ్ గా కంటెంట్ ని చూపించాడు.

మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుందని చెప్పాలి.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.ఇక మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

Telugu Dimple Hayati, Gopichand, Jagapathi Babu, Kushboo, Ramabanam, Ramabanam S

విశ్లేషణ:

ఇక ఈ సినిమాను డైరెక్టర్ ఆల్ మిక్స్డ్ కాన్సెప్ట్ తో ముందుకు తీసుకొచ్చాడు.మంచి కథను తీసుకున్నప్పటికీ కూడా కాస్త మెల్లగా సాగినట్లు అనిపించింది.కొంతవరకు రొటీన్ గానే అనిపించింది.అయినప్పటికీ కామెడీ, యాక్షన్ డ్రామాలతో బాగా చూపించాడు.

ప్లస్ పాయింట్స్:

గోపీచంద్ నటన, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ సీన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.

Telugu Dimple Hayati, Gopichand, Jagapathi Babu, Kushboo, Ramabanam, Ramabanam S

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ, కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాలో ఇద్దరన్నదమ్ముల మధ్య అనుబంధం అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.ఇక ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ కూడా కామెడీ, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలతో పూర్తి ఎంటర్టైన్మెంట్ అందించాడు డైరెక్టర్.ఇక ఈ సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాల వారిని నచ్చుతుందని చెప్పాలి.ఇక గోపీచంద్ ముందు ప్లాఫ్ అయినా సినిమాల కంటే ఈ సినిమాకు కొంతవరకు సక్సెస్ అందుకున్నాడని చెప్పాలి.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube