ఐపియల్ 23 సీజన్( IPL 23 ) టైం నడుస్తోంది.దాంతో క్రికెట్ లవర్స్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అనే తేడాలేకుండా ఏది అందుబాటులో ఉంటే దానికి అతుక్కుపోయి మరీ చూస్తున్నారు.
అయితే చాలామంది లైవ్ మ్యాచ్‌లను చూడలేకపోతున్నాము కదాని ఒకింత బాధతో వున్నారు.ఇపుడు అలాంటివారికి ఓ శుభవార్త.
రిలయన్స్ జియో( Reliance JIO ) వారికోసమే ప్రత్యేకంగా ఒక ఆప్షన్‌ను తెచ్చింది.మార్కెట్లోకి కొత్తగా ‘జియో డ్రైవ్ వీఆర్ హెడ్‌సెట్’( JioDive VR headset ) ఒకదానిని లాంచ్ చేసింది.
దీని ద్వారా ప్రేక్షకులు ఐపీఎల్ మ్యాచ్‌లను వర్చువల్ రియాల్టీలో వీక్షించడానికి అవకాశం ఉంటుంది.
అవును, లైవ్ మ్యాచ్ అనుభూతి పొందాలనుకునే వారు ఈ జియో డ్రైవ్ వీఆర్ హెడ్‌సెట్ వాడితే సరి.ఈ డివైజ్, జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను చూసే వారికి మాత్రమే ఉపయోగపడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి.జియో డ్రైవ్ వీఆర్ హెడ్‌సెట్‌లో 100-అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360డిగ్రీస్ వ్యూలో మ్యాచ్‌లు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇది ఆండ్రాయిడ్ ఐఓఎస్-15 వెర్షన్‌తోపాటు తర్వాత అందుబాటులోకి వచ్చిన ఓఎస్ వెర్షన్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది.

అయితే, ఇక్కడ హెడ్‌సెట్‌ను ఎలా వాడాలో తెలుసుకోవాలి.
1.జియో డైవ్ హెడ్‌సెట్ కొన్నాక మొదట బాక్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మర్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
2.తర్వాత అడిగిన వివరాలు ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

3.ఇక్కడ జియో నెట్‌వర్క్ కు మాత్రమే కనెక్ట్ అయి ఉండాలి.
4.తరువాత జియో డైవ్ ఆప్షన్ ఎంపిక చేసుకుని ‘వాచ్ ఆన్ జియో డైవ్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
5.తరువాత హెడ్‌సెట్ సపోర్ట్ క్లిప్, లెన్స్ సరిగ్గా సెట్ చేసుకుని తలకు పెట్టుకుని మ్యాచ్ చూడవచ్చు.







