రెండు వారాల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష( Virupaksha ) చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పటికే 80 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.
రేపటి నుండి తమిళం మరియు హిందీ లో డబ్ అయ్యి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.హిందీ మరియు తమిళం లో గత నెలలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా విరూపాక్ష చిత్రం ను అక్కడ కూడా భారీ గా విడుదల చేసేందుకు గాను ప్లాన్ చేయడం జరిగింది.ఆకట్టుకునే థ్రిల్లర్ కథ తో రూపొందిన ఈ సినిమా కు తమిళ ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయ్యారు.

ఇటీవల ప్రీమియర్ వేయడంతో వారి నుండి పాజిటివ్ స్పందన వచ్చింది.హిందీ లో కూడా సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.తెలుగు లో 80 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా వంద కోట్ల కు చేరడానికి హిందీ నుండి వసూళ్లు రాబట్టాల్సి ఉంది.కనీసం పాతిక కోట్ల ను హిందీ మరియు తమిళం నుండి రాబడితే ఈ సినిమా అక్కడ విడుదల అయినందుకు మంచి ప్రతిఫలం దక్కినట్లు అవుతుంది.
యూనివర్శిల్ కాన్సెప్ట్ తో రూపొందిన విరూపాక్ష సినిమా కచ్చితంగా భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.కనుక వంద కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
విరూపాక్ష సినిమా లో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కి జోడీగా లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్( Samyukta Menon ) నటించిన విషయం తెల్సిందే.కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా సాయి ధరమ్ తేజ్ నిలిచే అవకాశాలు ఉన్నాయి.







