టీ బీజేపీలోనూ ఎవరికి వారే.. బీఆర్‌ఎస్‌కి కలిసి వచ్చేది ఇదే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగబోతున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం చివర్లో జరగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) మరో సారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

 Telangana Bjp Leaders Not Unity For Next Elections Details, Bandi Sanjay, Bjp, E-TeluguStop.com

మరో వైపు జాతీయ స్థాయిలో అధికారం లో ఉన్న బిజెపి ( BJP ) తెలంగాణ లో అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) మరియు కీలక నేతలు పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

ఈ క్రమంలోనే బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేస్తుంది.కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా బీజేపీ నాయకుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Bjp, Brs, Etela Rajendar, Telangana Bjp, Telangana, Telugu-

చేరికల కమిటీని ఏర్పాటు చేసి ఇతర పార్టీల నుండి బిజెపి లోకి నాయకులను రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి.ఇటీవల ఖమ్మం జిల్లా కు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేను బిజెపి లో జాయిన్ కావడానికి అడిగేందుకు గాను చేరికల కమిటీ చైర్మన్ అయిన ఈటల రాజేందర్ సంప్రదించిన విషయం తెలిసిందే.పొంగులేటి ని ఈటెల సంప్రదించిన విషయం పై తనకు సమాచారం లేదంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బిజెపి లో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Telugu Bandi Sanjay, Bjp, Brs, Etela Rajendar, Telangana Bjp, Telangana, Telugu-

సోషల్ మీడియా లో బిజెపి రాష్ట్ర నాయకత్వం లో సరైన స్నేహపూర్వక వాతావరణం లేదని కనుక ముందు ముందు ఈ విషయం బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ కుమ్ములాటలతో వరుసగా రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని ఈసారి బిజెపి స్ట్రాంగ్ గా ఉందని భావిస్తున్న సమయం లో ఆ పార్టీ లో కూడా అంతర్గత కుమ్ములాటలు ఉంటే కచ్చితంగా ఇబ్బందులు తప్పవు అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube