అతను ఒక పేద వ్యక్తి. అతనికి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే కల ఉండడంతో కష్టపడి పైసా పైసా పోగుచేసి ఓ పాత ఇల్లు కొనుక్కున్నాడు.
కొన్న ఇంటిని మరమ్మతులు చేయించే పనిలో భాగంగా పాత గోడలను కూల్చితే కట్టల కొద్ది కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి.కళ్ళ ముందు నోట్ల కట్టలు కనిపిస్తే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు అనేవి లేకుండా పోయాయి.
లక్షల కొద్ది డబ్బు దొరికింది అని ఆనందించే లోపే ఊహించని ట్విస్ట్ నెలకొంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సాధారణంగా పాత ఇళ్ళను కూల్చినప్పుడు భూమిలో బంగారు, లంకె బిందెలు దొరికాయని చాలా వరకు వినే ఉంటారు.ఎందుకంటే పూర్వికులు తమ సంపదను బంగారం, వెండి రూపాలలోకి మార్చి ఇంటి ఆవరణలోనే భద్ర పరుస్తుంటారు.
కానీ ఓ వ్యక్తికి లక్షల కొద్ది నోట్ల కట్టలు దొరికాయి.దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.UK లోని నార్త్ వెస్ట్ స్పెయిన్ లో ( North-West Spain ) టోనో పినిరో( Tono Pineiro ) అనే వ్యక్తి ఇటీవలే ఓ పాత ఇంటిని కొనుగోలు చేశాడు.పాత గోడలను మరమ్మత్తుల కోసం ఉండగా గోడలో కొన్ని డబ్బాలు బయటపడ్డాయి.

డబ్బా మూతలు తెరవగా లక్షల కొద్ది స్పెయిన్ కరెన్సీ నోట్ల కట్టలు( Spain Currency ) కనిపించాయి.ఆ డబ్బులు లెక్కించగా 48.14 లక్షల రూపాయలుగా లెక్క తేలింది.ఇక ఆ కుటుంబం ఆనందంలో కాసేపు మునిగి తేలింది.అసలు విషయం తెలియడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలోని వ్యక్తులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.1868 నుండి 2002 వరకు ఆ కరెన్సీ స్పెయిన్ అధికారిక కరెన్సీగా చలామణిలో ఉండేది.2022లో స్పెయిన్ ప్రభుత్వం ఆ కరెన్సీని నిషేధించింది.

విషయం తెలియని ఆ ఇంటి యజమాని డబ్బుతో బ్యాంకుకు వెళ్ళగా.బ్యాంక్ అధికారులు ఈ కరెన్సీ ప్రభుత్వం నిషేధించిందని, నోట్ల మార్పిడి గడువు కూడా ముగిసిందని తెలిపారు.ఆ కరెన్సీని బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారిక కరెన్సీ కాకపోవడంతో అతనికి ఎటువంటి ప్రత్యామ్నాయం దక్కలేదు.బ్యాంకు వారికి కూడా ఈ కరెన్సీ తో ఎటువంటి ప్రయోజనం లేకపోయినా మెమెంటోగా ఉంచుతామని బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్త తెలిసిన వారంతా పేదవాడికి అదృష్టం వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్ళిపోయిందని అంటున్నారు.








