వివేకా హత్య కేసులో సీబీఐ కౌంటర్ కాపీలో కీలక అంశాలు

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో కీలక అంశాలను పేర్కొంది.మాజీ మంత్రి వివేకా హత్య కేసును రెండు నేరాలుగా పరిగణించింది.

 Key Points In Cbi Counter Copy In Viveka's Murder Case-TeluguStop.com

ఇందులో ఒకటి హత్య కాగా, మరొకటి ఆధారాలు చెరిపివేయడమని పేర్కొంది.ఈ క్రమంలో అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని సీబీఐ తెలిపింది.

అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి వాస్తవాలు చెప్పడం లేదంది.దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా అవినాశ్ రెడ్డి సమాధానాలు ఇచ్చారని వెల్లడించింది.

దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే ముందస్తు బెయిల్ కోరుతున్నారని తెలిపింది.కాగా హత్య కేసులో ఆధారాలు చేరిపేసిన నేరంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్, శివశంకర్ తోపాటు అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు చేర్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube