మామూలుగా హీరోయిన్లు ఒక పెళ్లి విషయంలో తప్ప అన్ని విషయాలలో చాలా ఫ్రీగా ఉంటారు.అదేంటో కానీ పెళ్లి విషయం తీస్తే చాలు ఫైర్ అవుతూ ఉంటారు.
ఎందుకో తెలియదు పెళ్లంటే చాలా దూరంగా ఉంటారు.అయితే అటువంటి సెలబ్రెటీలు కొన్ని కొన్ని సార్లు పెళ్లి అంటూ పెద్ద షాక్ ఇస్తూ ఉంటారు.
మామూలుగా వాళ్ళు పెళ్లి అనే పదం తీయటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.కానీ ఒక్కొక్కసారి జనాలను ఆశ్చర్యపరిచేలా పెళ్లి అంటూ టాపిక్ తీసి ఆలోచనలో ముంచేలా చేస్తారు.
ఇప్పుడు హెబ్బా పటేల్ కూడా అదే పని చేసింది.ఆమె షేర్ చేసుకునే స్టోరీ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యూటీ హెబ్బా పటేల్ ( Hebba Patel )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు .తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.తన హాట్ హాట్ లుక్కులతో కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.
ఇక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా 2014లో పరిచయం అయింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ ( Kumari 21f )తో పరిచయం అయింది.
ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
కానీ అంతగా మెప్పించలేకపోయింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరు.దీంతో అవకాశాల కోసం బాగా ఆరాట పడుతుంది.
పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.
మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.
తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
కొన్నిసార్లు తన ఫోటోల పట్ల కూడా బాగా నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.కానీ వాటిని పట్టించుకోకుండా అవకాశాల కోసం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో చీర కట్టుకొని, నగలు పెట్టుకొని ఉన్న ఫోటోలు షేర్ చేసుకుంది.చూడ్డానికి మంచి లుక్ తో కనిపించగా.ఆ ఫోటోకు.
వెల్కమ్ టు మై పెళ్లికూతురు ఫంక్షన్ ( Welcome to my bridal function )అంటూ పంచుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఏంటి నిన్ను పెళ్లి కూతురిని చేస్తున్నారా.
నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు.మరి ఆమె ఏ విధంగా ఉద్దేశించి అలా పెట్టిందో తెలియదు కానీ.
కొంతమంది మాత్రం పెళ్లి గురించే అనుమానాలు తీస్తున్నారు.ఇక మరి కొంతమంది అది షూటింగ్ కు సంబంధించిందేమో అని అంటున్నారు.







