Director Teja: తేజ ప్రకటించిన ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో ?

ఒక ప్లాపుల్లో ఉన్న దర్శకుడిని నమ్మి సినిమా ఇవ్వాలంటే నిర్మాతలు డబ్బులు పెట్టాలంటే ఆలోచిస్తారు అలాగే హీరోలు కూడా సినిమా కి డేట్స్ ఇవ్వడానికి ముందుకు రాదు.సదరు దర్శకుడు గతం లో ఎన్ని మంచి ప్రాజెక్ట్స్ చేసిన కూడా ఇండస్ట్రీ ఎప్పుడు హిట్స్ ఇస్తున్న వారి వెంటే ఉంటుంది.

 Directot Teja Upcoming Movies Alivelu Manga Venkataramana Rakshasaraju Ravanasa-TeluguStop.com

డైరెక్టర్ చేసే సినిమాలకు మాత్రమే క్రేజ్ వస్తుంది.అలాంటి వారితో నటించడానికి మాత్రమే హీరోలు ఒకే అంటారు.

ఒక్కసారి ప్లాప్ పడిందా ఇక అంతే సంగతులు.ఆ డైరెక్టర్ ని పట్టించుకునే నాధుడే ఉండడు.

Telugu Ahimsa, Alivelumanga, Teja, Gopichand, Rana, Rakshasaraju-Movie

ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు డైరెక్టర్ తేజ.( Director Teja ) కెరీర్ లో 70 శాతం విజయాలు ఉన్నప్పటికి అయన తలపెట్టిన రెండు సినిమాలు మాత్రం పట్టాలు ఎక్కడం లేదు.చివరగా అయన దర్శకత్వంలో 2019 లో బెల్లం కొండా శ్రీనివాస్ మరియు కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్స్ గా వచ్చిన సినిమా సీత.ఈ సినిమా ఘోర పరాజయం పాలయ్యింది.

ఈ సినిమా తర్వాత దాదాపు ఐదేళ్ళలో మూడు సినిమాలు ప్రకటించాడు తేజ.

Telugu Ahimsa, Alivelumanga, Teja, Gopichand, Rana, Rakshasaraju-Movie

అందులో ఒక అహింస ( Ahimsa Movie ) మాత్రమే ప్రస్తుతానికి విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక మిగతా రెండు ప్రాజెక్ట్స్ అటకెక్కాయి అనుకోవాల్సిందే.పోనీ ఆ రెండు చిత్రాలు కూడా కొత్తవాళ్ళతోనే లేదా ఇంతకు ముందు చేయని వారితో కూడా మొదలు పెట్టలేదు.

హీరో గోపీచంద్ తో అలివేలు మంగ వెంకరమణ( Alivelu Manga Venkataramana ) అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా ప్రారంభించాడు.గోపీచంద్ తో ఇంతకన్నా ముందే జయం వంటి సూపర్ హిట్ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే.

Telugu Ahimsa, Alivelumanga, Teja, Gopichand, Rana, Rakshasaraju-Movie

ఇక మరొక సినిమా పేరు రాక్షసరాజు రావణాసురుడు( Rakshasa Raju Ravanasurudu ) అనే టైటిల్ తో రానా ( Rana ) హీరో గా ఒక చిత్రాన్ని ప్రకటించాడు.ఈ సినిమా కన్నా ముందు నేనే రాజు నేనే మంత్రి సినిమా వీరి కాంబినేషన్ లో వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇలా ఒక్కో హీరో తో ఒక్కో సాలిడ్ హిట్ ఉన్నప్పటికి మరొక సినిమా చేయడానికి మాత్రం వీరు ముందురావడం లేదు.మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు పాట్లాలెక్కుతాయో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube