యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లాలో కల్తీ పాల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట ఈ కల్తీ పాల దందా వెలుగు చూస్తూనే ఉంది.
పాలు అంటేనే జిల్లా ప్రజలు భయకంపితులవుతున్నపరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం జూలురు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటి పోలీసులు మెరుపు దాడి చేశారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన పాల వ్యాపారి కాసుల శేఖర్(30) ను అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుండి 100 లీటర్ల కల్తీ పాలతో పాటు,పాలను కల్తీ చేసేందుకు వాడుతున్న 500 మి.లీ హైడ్రోజన్ పెరాక్సైడ్,2 కేజీల దోల్పూర్ స్కిమ్ పాల పౌడర్ ను స్వాధీనం చేసుకొన్న ఎస్ఓటి పోలీసులు,నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు.







