మహారాష్ట్ర రాజకీయాల్లో అపరచాణక్యుడిగా పేరుగాంచిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్( Sharad Pawar ) తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు .తన ఆత్మ కథ పుస్తకావిష్కరణ సభలోనే ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు….
ఆయన ఆకస్మిక ప్రకటనతో ఎన్సీపీ శ్రేణులు భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తుంది … విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపించిన శరద్ పవార్ దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు .

కాంగ్రెస్ పార్టీ తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు అంతేకాకుండా కేంద్ర మంత్రిగా వ్యవసాయం, రక్షణ వంటి కీలక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించి పేరు తెచ్చుకున్నారు.రాజకీయ వ్యూహాలను పన్నడం లో ఆయనకు ఆయనే సాటి అని చెబుతారు ప్రస్తుత రాజకీయాల్లో వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరైన భాజాపా నే ఓడించిన నాయకుడిగా ఈయన పేరు చెబుతారు ….శివసేన ప్రభుత్వాన్ని ( Shiv Sena )కూలదొయ్యాలని ప్రయత్నించిన భాజపాకు షాక్ ఇస్తూ కాంగ్రెస్, శివసేన తో కలిపి మహా వికాస్ అగాడి పేరుతో కొత్త కూటమి ఏర్పరిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత శరద్ పవార్ కే దక్కుతుంది .బీసీసీ అధ్యక్షుడిగా ఐసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఈయన చేసిన రాజకీయ సేవలకు పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా పొందారు.

82 సంవత్సరాలు తన రాజకీయ ప్రయాణానికి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఆయన అన్న కుమారుడైన అజిత్ పవార్ వైఖరే( Ajit Pawar ) కారణమని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే రెండుసార్లు ఎన్సిపి ని చీల్చడానికి ప్రయత్నించిన అజిత్ పవార్ ని ప్రయత్నాలని తన రాజకీయ చాణక్యంతో తిప్పి కొట్టగలిగినప్పటికి తన వయోభారంతో పార్టీపై పట్టు ను దీర్ఘ కాలం నిలుపుకోవడం కష్టమని భావించడంతోనే ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

అయితే తన రాజకీయ వా వారసుడుగా ఆయన అజిత్ పవర్ పేరును ప్రకటించకపోవడం గమనార్హం.ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఒక కమిటీని వేస్తానని ఆయన తెలిపారు ఏది ఏమైనప్పటికీ మరాఠా రాజకీయాల్లో అపర మేధావి గా పేరుగాంచిన శరద్ పవార్ రాజీనామా ఉవ్వెత్తున ఎగసిన ఒక రాజకీయ శకానికి ముగింపు పలికిందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు .







