సంక్రాంతి కోసం మెగాస్టార్ మెగా ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా దాదాపుగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.ఇక ఈ సంవత్సరం భోళా శంకర్ సినిమా తో మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

 Megastar Chiranjeevi Going To Do A Film For Next Sankranthi , Keerthy Suresh ,-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి( Megastar chiranjeevi ) భోళా శంకర్ తర్వాత చేయబోతున్న సినిమా ఏంటి.అది ఎప్పుడు వస్తుంది అనేది ఆసక్తి అందరిలో నెలకొంది.ఇప్పటికే ఆయన దృష్టిలో ముగ్గురు నలుగురు యంగ్‌ డైరెక్టర్స్ ఉన్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Sankranthi, Tam

ఒకటి రెండు నెలల్లోనే వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేసి సినిమా ను మొదలు పెట్టేందుకు మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మెగా కాంపౌండ్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Sankranthi, Tam

జూన్.జూలై వరకు చిరంజీవి యొక్క కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.భోళా శంకర్ ( Bhola Shankar )సినిమా విడుదల అవ్వక ముందే కొత్త సినిమా ను ప్రారంభిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం తో చిరంజీవి మరియు ఇతర మెగా కాంపౌండ్ కు చెందిన వారు భావిస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) నటిస్తోంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, Sankranthi, Tam

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని చిరంజీవికి కట్టబడుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా తో ఉన్నారు.చిరంజీవి సినిమా కి మినిమం టాక్‌ దక్కించుకుంటే చాలు రూ.100 కోట్లు ఈజీగా కలెక్షన్స్ నమోదు అవుతాయి.కనుక భోళా శంకర్ సినిమా ఖచ్చితంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది.

తద్వారా వంద కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది అని మెగా అభిమానులు ధీమాతో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube