రోజుకి రూ.17 లక్షలు సంపాదిస్తున్న ఐఐటీఎన్.. అప్పుడు మాత్రం అప్పులపాలు..

కిషోర్ ఇందుకూరి( Kishore Indukuri, ) గతంలో యునైటెడ్ స్టేట్స్‌లో ఇంటెల్ ఉద్యోగిగా ఎంపికై ఆకర్షణీయమైన యాన్యువల్ ప్యాకేజీ పొందారు.ఆ జాబ్‌ ద్వారా వచ్చే జీతంతో అమెరికాలో అతను ఈజీగా సెటిల్ అయ్యేవారు.

 Kishore Indukuri Iitian Earns Rs 17 Lakh Per Day Selling Milk , Kishore Indukuri-TeluguStop.com

కానీ ఆ జీవితాన్ని తృణపాయంగా వదిలేశారు.అందుకు బదులుగా ఈ ఐఐటీఎన్ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో భారీ డెయిరీ ఫామ్ ప్రారంభించారు.

మొదట 20 ఆవులతో 2012లో డెయిరీ ఫామ్‌ను ప్రారంభించారు.అంతకు ముందు అనేక ఇతర వ్యాపారాలను కూడా స్టార్ట్ చేశారు కానీ వాటిలో సక్సెస్ కాలేకపోయారు.

తన సేవింగ్స్ అన్ని కోల్పోయి చివరికి అప్పుడు పాలు కూడా అయ్యారు.

Telugu Cow, Dairy, Hyderabad, Iit Kharagpur, Intel Employee, Privatemilk-Busines

తర్వాత కిషోర్ తన పాలను లీటరుకు రూ.30 ఉత్పత్తి ఖర్చుతో రూ.15కి విక్రయించారు.నీరు, మందులు, హార్మోన్లు లేకుండా స్వచ్ఛమైన పాలుగా ప్రజలకు తన పాలను పరిచయం చేశారు.కావాలంటే కస్టమర్లు ముందుగా తమ డెయిరీ ఫామ్( Dairy business 0 లోని పాలను తాగి, ఆ తర్వాతే డబ్బులు చెల్లించమని కోరారు.

దీనివల్ల అతనికి కస్టమర్లు పెద్ద సంఖ్యలో పెరిగిపోయారు.నేడు, అతను హైదరాబాద్‌లోని అతిపెద్ద ప్రైవేట్ పాల సరఫరాదారులలో ఒకరిగా నిలుస్తున్నారు.వందలాది మంది రైతుల నుంచి స్వచ్ఛమైన పాలను సేకరించి, వేలాది మంది రోజువారీ వినియోగదారులకు వాటిని సరఫరా చేస్తున్నారు.

Telugu Cow, Dairy, Hyderabad, Iit Kharagpur, Intel Employee, Privatemilk-Busines

ఇందుకూరి తన పొదుపు మొత్తాన్ని వ్యాపారాన్ని ప్రారంభించడంలో పెట్టుబడి పెట్టారు.రూ.1.3 కోట్ల రుణం తీసుకున్నారు.షాబాద్‌లో భారీ పొలాన్ని కూడా కొనుగోలు చేశారు.

అతను ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో వ్యాపారాన్ని నడుపుతున్నారు.

Telugu Cow, Dairy, Hyderabad, Iit Kharagpur, Intel Employee, Privatemilk-Busines

హైదరాబాద్‌( Hyderabad )లో కిషోర్ నడుపుతున్న సిడ్ డెయిరీ ఫామ్ 100 మందికి పైగా పశువులు, 120 మంది ఉద్యోగులతో నగరంలో అతి పెద్దదిగా నిలుస్తోంది.2020-21లో కంపెనీ ఆదాయం రూ.44 కోట్లు కాగా, 2021-22లో రూ.64.5 కోట్లకు (రోజుకు దాదాపు రూ.17 లక్షలు) పెరిగింది.సేవింగ్స్ అన్నీ కోల్పోయినా పట్టు విడవకుండా నమ్మకంతో ముందుకు సాగుతూ కిషోర్ మళ్లీ భారీ సక్సెస్ ని అందుకున్నారు.

వ్యాపారులందరూ కూడా ఇలాంటి పట్టుదలతోనే ఉండటం ముఖ్యమని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube