ఏలూరు జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు.అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
సీఎం రాష్ట్రం అంతటా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే రైతుల బాధ తెలుస్తుందని తెలిపారు.హెలికాఫ్టర్ లో కాకుండా నేరుగా రైతుల వద్దకు సీఎం వెళ్లాలని సూచించారు.
వర్షాలపై ముందస్తుగా హెచ్చరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.రైతులకు సరైన గోనె సంచులు కూడా ఇవ్వడం లేదన్నారు.
రైతుల నుంచి డబ్బులు వసూలు చేసే పరిస్థితి మారాలని తెలిపారు.పంట పండిన ప్రాంతంలోనే కొనుగోలు చేసేలా చూడాలని వెల్లడించారు.
ఆర్బీకేలతో రైతులకు ఉపయోగం లేదని విమర్శించారు.







