రాజన్న సిరిసిల్ల ఆర్టీసి డిపో నుండి ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, కామారెడ్డి మీదుగా హైదరాబాద్ కు, ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట,ముస్తాబాధ్ వయా సిద్దిపేట మీదుగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు ప్రతి ఆదివారం కొమురవెల్లి మల్లన్న దేవస్థానం కు ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట వయా ముస్తాబాద్ సిద్దిపేట మీదుగా కొమురవెల్లి కి, ఎల్లారెడ్డిపేట , బీబీపెట మీదుగా రామాయంపేట కు బస్ నడపాలని ఇటీవల ఆర్ టి సి ఎం డి సజ్జనార్ కు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ బస్ భవన్ లో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఆర్ టి సి ఎం డి సజ్జనార్ ఆదేశాల మేరకు సిరిసిల్ల ఆర్ టి సి డిపో మేనేజర్ ఆధ్వర్యంలో పై రూట్ లలో బస్ సర్వే నిర్వహించారు.అదే విధంగా ఎల్లారెడ్డిపేట ఆర్ టి సి బస్ స్టాండ్ లో గల మూత్రశాలలకు తలుపులు సరిగా లేకపవడంతో ఇక్కడికి వచ్చిన సిరిసిల్ల ఆర్ టి సి డిపో ఎస్ టి ఐ కి చూపెట్టగా సరిచేస్తామని ఆయన అన్నారు.ఈ రూట్ సర్వే కార్యక్రమం లో సిరిసిల్ల ఆర్ టి సి డిపో ఎస్.టి.ఐ ఎల్ సారయ్య, సేఫ్టీ డ్రైవర్ లకావత్ పర్శారం, కండక్టర్ ఎల్ దేవయ్య పాల్గొన్నారు.







