Posani Krishna Murali: అశ్వినీదత్, ఆదిశేషగిరిరావు వాఖ్యలపై మండిపడిన పోసాని.. అసలేం జరిగిందంటే?

తాజాగా టాలీవుడ్ సీనియర్ నిర్మాతలు అయిన ఆదిశేషగిరిరావు, అశ్విని దత్త్ తాజాగా మే 1న జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నంది అవార్డులు( Nandi Awards ) గురించి స్పందిస్తూ పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఈ సందర్బంగా వాళ్లు మాట్లాడుతూ.

 Posani Krishna Murali Reaction On Aswini Dutt Adi Seshagiri Rao Comments-TeluguStop.com

ప్రభుత్వానికి ఆ అవార్డు ఇచ్చే ఆసక్తి లేదు.ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు.

ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు.ప్రస్తుతం అవార్డు వాళ్ళకి ఇస్తారు.

సినిమాలకు ఇచ్చే అవార్డులు ఇచ్చే రోజులు ఇంకా రెండు మూడేళ్ళలో వస్తుంది అని తెలిపారు.

తాజాగా ఈ వ్యాఖ్యలు పై టాలీవుడ్ నటుడు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) కాస్త ఘాటుగా స్పందించారు.ప్రస్తుతం అందుకు సంబందించిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ.

అశ్విని దత్త్( Ashwini Dutt ) అన్న నువ్వు మాట్లాడాల్సింది ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు.ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు అని మాట్లాడాలి.

ఉత్తమ వెదవలు, ఉత్తన సన్యాసులు అని మీ వాళ్ళకే ఇవ్వాలి.ఎందుకు మీరు జగన్ పై పడి ఏడుస్తున్నారు.

మీకేమి అన్యాయం చేశారు.చంద్రబాబు లాగా వెన్నుపోటు పొడిచారా? లేదా పలానా వారికీ అన్యాయం చేశాడని నిరూపించండి నేను నీ కాళ్ళకి దణ్ణం పెడతాను.

ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టినప్పుడు నువ్వు ఏమి చేశావు.నీ బ్రతుకు నాకు తెలుసు నా బ్రతుకు నీకు తెలుసు.కొంచెమైన నీతితో బ్రతుకు అంటూ పోసాని అశ్విని దత్త్ వ్యాఖ్యల పై విరుచుకుపడ్డాడు.ఆ తరువాత ఆదిశేషగిరిరావు మాటలకు స్పందిస్తూ.జగన్ గారు వచ్చిన తరువాత నంది అవార్డులు ఇవ్వలేదు.ఒకవేళ అవార్డులు ఇచ్చి ఉంటే, మీరు అన్నట్లు జరిగి ఉంటే మీరు విమర్శించవచ్చు.

కానీ జగన్ గారు నంది అవార్డ్స్ ని ఎవరైతే అర్హులో వారికే అందజేస్తారు అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube