ఇక రోడ్లు కూడా డిజిటల్‌ మయం కాబోతున్నాయి!

అవును, మీరు విన్నది నిజమే.ఇపుడు ప్రతిదీ డిజిటల్ మయం అయిపోతుంది.

 Nhai Plans For Digital Highways To Connect With 5g And 6g Technologies Details,-TeluguStop.com

మోడీ ఏ ముహూర్తాన డిజిటల్ ఇండియా( Digital India ) అని ప్రకటించాడో గాని, అప్పటినుండి దేశంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయనే విషయం అందరికీ తెలిసినదే.ఇపుడు తాజాగా జాతీయ రహదారుల వెంట 10 వేల కిలోమీటర్ల మేర ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్స్‌( Optic Fiber Calbles ) ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించడం విశేషం.

తొలి విడతతో ప్రయోగాత్మకంగా 1,367 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఢిల్లీ-ముంబై జాతీయ రహదారితోపాటు 512 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారులను డిజిటల్‌ రోడ్లుగా( Digital Roads ) అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Telugu Highways, India, Roads, Hydbangalore, Latest, Nhai, Ups-Latest News - Tel

దానికోసం ప్రత్యేకంగా నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌) పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) కూడా ఏర్పాటు చేయడం ఇపుడు హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి.ఈ క్రమంలో జాతీయ రహదారి పక్కన 3 మీటర్ల మేర డెడికేటెడ్‌ కారిడార్‌లో ఓఎఫ్‌సీ ఏర్పాటు చేస్తారు.హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి సైతం డిజిటల్‌ రోడ్డుగా మారనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

డిజిటల్‌ రోడ్ల ఏర్పాటుతో ఈ రహదారి వెంట 5జీ, 6జీ నెట్‌వర్క్‌ సేవలు లభించడంతోపాటు రహదారి వెంట ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.

Telugu Highways, India, Roads, Hydbangalore, Latest, Nhai, Ups-Latest News - Tel

దానిద్వారా ఈ రహదారి వెంబడి ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీల ఏర్పాటు చేసుకునే వారికి మంచి అవకాశం చేకూరుతుందని చెప్పుకోవచ్చు.ఎందుకంటే జాతీయ రహదారి వెంట ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆయా ఐటీ కంపెనీల పంట పండినట్టే.హైదరాబాద్‌ – బెంగళూరు రహదారి వెంట ఉన్న తెలుగు రాష్ట్రాల్లో గల జడ్చర్ల, అనంతపురం, కర్నూలు, గుత్తి, హిందుపూర్‌ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశం బాగా ఉంటుంది.

డిజిటల్‌ రోడ్ల వల్ల టైర్‌-2, 3 పట్టణాల్లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటు చేయొచ్చు.తద్వారా అధికంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube