ప్రతి నెలా పదుల సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉంటాయి.కొన్నిసార్లు విడుదలైన అన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్నిసార్లు అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి.
ఏప్రిల్ నెల బాక్సాఫీస్ ను పరిశీలిస్తే రెండు సినిమాలు సక్సెస్ సాధించగా మిగతా సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.ఏప్రిల్ నెల సినిమాల విషయానికి వస్తే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రావణాసుర, మీటర్( Ravanasura, meter ) సినిమాలు విడుదలయ్యాయి.

ఈ రెండు సినిమాలలో ఏ సినిమా కూడా హిట్ కాలేదు.ఒక సినిమాను మించి మరొకటి ఈ రెండు సినిమాలలో డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే రెండో వారం శాకుంతలం( Sakunthalam ) రూపంలో మరో భారీ షాక్ తగిలింది.శాకుంతం సినిమాకు ఏకంగా 22 కోట్ల రూపాయల రేంజ్ లో దిల్ రాజుకు( Dil raju ) నష్టం వచ్చింది.
ఈ సినిమా స్థాయిలో మరే సినిమా నష్టాలను మిగల్చలేదని దిల్ రాజు తెలిపారు.

శాకుంతలం రిలీజైన రోజున రుద్రుడు( Rudrudu ) సినిమా కూడా రిలీజ్ కాగా ఈ సినిమా ఫ్లాప్ అయింది.అదే రోజు విడుదలైన విడుదల పార్ట్1 కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.ఏప్రిల్ మూడో వారంలో విరూపాక్ష( Virupaksha ) విడుదల కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
ఈ సినిమాకు పోటీగా 4 చిన్న సినిమాలు రిలీజ్ కాగా ఆ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

విరూపాక్ష సినిమాకు ఇప్పటివరకు 76 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఏప్రిల్ చివరి వారంలో ఏజెంట్, పీఎస్2 ( Agent, PS2 )రిలీజ్ కాగా ఈ సినిమాలలో పీఎస్2 సక్సెస్ సాధిస్తే ఏజెంట్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.ఏజెంట్ సినిమా నష్టాల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది.
ఏప్రిల్ నెలలో విరూపాక్ష, పీఎస్2 సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.







