గత ఏపీ రాజకీయాలు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి.ఈ మూడు పార్టీల మద్య పొత్తుకు సంబంధించిన వ్యవహారమే ఎప్పుడు చర్చనీయాంశంగా ఉంటుంది.
అయితే జనసేన, బీజేపీ పార్టీలు ఎప్పటినుంచో మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి.పవన్( Pawan kalyan ) మావాడు అంటూ బీజేపీ నేతలు తరచూ చెబుతూనే ఉన్నారు.
అటు పవన్ కూడా బీజేపీతో దోస్తీని ఎప్పటికప్పుడు కన్ఫర్మ్ చేస్తూనే ఉన్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని కమలనాథులు పదే పదే చెబుతున్నారు.
అయితే ఈ విషయాన్ని మాత్రం పవన్ కన్ఫర్మ్ చేయడంలేదు.ఇక్కడే అసలు చిక్కు మొదలైంది.
ఎందుకంటే ఏపీలో బీజేపీ( BJP )కి బలమైన ప్రజాధరణ లేదు.

అందువల్ల బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే జనసేనకు ఒరిగేదెమి లేదు.కాబట్టి పవన్ టీడీపీ వైపు చూస్తున్నారు.వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వమని ఘంటాపథంగా చెబుతున్నా పవన్.
అలా జరగాలంటే టీడీపీతో కలవడం తప్పా పవన్ ముందు వేరే దారిలేదు.టీడీపీతో కలిసేందుకు తాము సిద్దమే అనే సంకేతాలను కూడా ఇచ్చారు పవన్.
అయితే బీజేపీ కూడా టీడీపీతో కలవాలన్నది పవన్ ప్లాన్.కానీ కాషాయ నేతలు మాత్రం టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంటున్నారు.
ఇక మొన్నటికి మొన్న డిల్లీ వెళ్ళిన పవన్ టీడీపీతో కలవాలనే ప్రాతిపాదనను బీజేపీ పెద్దల ముందు ఉంచరాట.అయితే దానిపై కమలనాథులు పెద్దగా స్పందించలేదట.

మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో పొత్తుల విషయంలో తుది నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో పవన్ ఇటీవల చంద్రబాబుతో బేటీ అయ్యారు.దాంతో బీజేపీ దోస్తీకి గుడ్ బై చెప్పి టీడీపీతో పొత్తు(TDP ) పెట్టుకొనే ప్లాన్ లో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.అమద్య కూడా పవన్ బీజేపీ నుంచి బయటకు వస్తామనే విధంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

దీంతో పవన్ వైఖరిపై బీజేపీ డౌట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.బీజేపీతో పొత్తులో ఉన్నది లేనిది పవనే క్లారిటీ ఇవ్వాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా చెప్పుకొచ్చారు.దీన్ని బట్టి చూస్తే పవన్ లేకుండానే ఎన్నికలకు వెళ్ళేందుకు బీజేపీ సిద్దమైనట్లే తెలుస్తోంది.మొత్తానికి బీజేపీ టీడీపీ కలిసే అవకాశాలు కనిపించడంలేదు.దాంతో పవన్ టీడీపీ వైపే అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమౌతోందని విశ్లేషకులు చెబుతున్నారు.








