ఈ రోజు మే డే అనే విషయం అందరికి తెలుసు.శ్రమజీవుల కష్టానికి గుర్తింపుగా మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపు కుంటారు అనే విషయం తెలిసిందే.
మరి ఈ సందర్భంగా కార్మికులకు సెలవు ప్రకటిస్తారు.కార్మికుల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోళా శంకర్’ ( Bhola Shankar ) నుండి శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని స్టిల్స్ ను వదిలారు.
తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే చిరు నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించగా ఇప్పుడు భోళా శంకర్ తో మరో హిట్ అందుకోవాలని చిరు ప్లాన్ చేసుకుంటున్నాడు.రీమేక్ సినిమా అయినా కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మెహర్ రమేష్ ( Meher Ramesh ) సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ రోజు మే డే ( #MayDay )సందర్భంగా సరికొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్.”కార్మికులు,కర్షకులు, శ్రమ జీవులకు అందరికి మే డే శుభాకాంక్షలు” అంటూ చిరు టాక్సీ డ్రైవర్ లుక్ లో ఉన్న పలు ఫోటోలను రిలీజ్ చేయగా ఇవి నెట్టింట నిముషాల్లోనే వైరల్ గా మారిపోయాయి.ఈయన లుక్ బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమాను ఫాస్ట్ గా పూర్తి చేసి ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.








