తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి.పలు జిల్లాల్లో వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో కురిసిన వానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్ధయింది.మరోవైపు చేతికి వచ్చిన పంటలు నీట మునిగాయి.
దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఇవాళ, రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







