అవును, మీరు విన్నది నిజమే.పలు ఐటీ కంపెనీలు టెక్నాలజీలో ప్రపంచానికి పెద్దన్న పోషిస్తున్న అమెరికాకే ఝలక్ ఇచ్చాయి.
దాంతో ఈ వ్యవహారాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన అమెరికా యాక్షన్ మోడ్ లోకి దిగింది.ఈ క్రమంలో ఈ చర్యలకు పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ప్రకటన చేసింది.
విషయం ఏమంటే, అక్కడి కొన్ని టెక్ కంపినీలు హెచ్1బీ వీసాల( H-1B visa ) కోసం ఫెడరల్ వ్యవస్థనే టాంపర్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అమెరికా వెళ్లాలని, జాబ్ చేయాలని, ఎంతోకొంత వెనకేసుకొని రావాలని అక్కడికి ప్రతియేటా ఎంతోమంది వెళుతూ వుంటారు.కొంతమంది చదువుకోవాలని, మరికొంతమంది వ్యాపారం చేసుకొని అక్కడే స్థిర పడాలని కలలు కంటూ ఉంటారు.అయితే ఈ అమెరికా వీసా అనేది అంత ఈజీగా రాదు.
లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించినా… వీసా కోసం అనేక తిప్పలు తప్పవు.ఈ క్రమంలో అమెరికా పలు రకాల వీసాలు ఆఫర్ చేస్తోంది, కానీ ఇందులో అన్నింటికంటే ముఖ్యమైనది హెచ్1బీనే.

అమెరికా( America )లో ఉండే పలు కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించే వీసా ఇది.దీంతో ఈ వీసాలను దక్కించుకోవడం కోసం టాప్ కంపెనీలు అనేవి ఎల్లపుడూ పోటీపడుతుంటాయి.వీటికున్న క్రేజ్ అలాంటిది మరి.అందుకే, హెచ్1బీ వీసాల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయ్ ఆయా కంపెనీలు.

కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్‌లో చీటింగ్ జరుగుతున్నట్టు తాజాగా తెలుసుకున్న అమెరికా ఆయా కంపెనీలపైన వేటువేసే పనిలో ఉన్నట్టు భోగట్టా.ఈ విషయమై ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిన ఫెడరల్ ఏజెన్సీ… ఒకటి కంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లపై చర్యలకు రెడీ అవుతోంది.ఈ క్రమంలో ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చింది.







