అల్లరి నరేష్( Allari Naresh ) విజయ్ కనకమేడల ఇద్దరు కలిసి చేసిన ఉగ్రం సినిమా మే 5న రిలీజ్ అవుతుంది.ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో నరేష్ తన ఎక్స్ పీరియన్స్ ని మీడియాతో పంచుకున్నారు.
ఉగ్రం( Ugram ) సినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా 15 రోజుల పాటు నైట్ షూట్ చేసినట్టు చెప్పారు.అంతేకాదు వీటి కోసం నరేష్ బాగా హార్డ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది.
విజయ్ కనకమేడలతో ఆల్రెడీ నాంది చేసిన నరేష్ ఈ సినిమా కథ విన్నప్పుడే సూపర్ ఎగ్జైట్ అయినట్టు చెప్పుకొచ్చాడు.

ఉగ్రం సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ సినిమాగా వస్తుందని అన్నారు.ఇక ఈ సినిమా కోసం సిగరెట్లు కూడా బాగా తాగేశానని అన్నారు నరేష్.నాంది( Naandhi ) తో హిట్ అందుకున్న ఈ కాంబో ఉగ్రం తో కూడా హిట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
ఉగ్రం హిట్ అందుకుంటుందా లేదా అన్నది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది.నరేష్ మాత్రం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో నరేష్ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు.







