ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం గురించి మాట్లాడిన ఆయన ఇటువంటి రాజకీయ భేటీలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు.
అయితే నిన్న జరిగిన భేటీకి సంబంధించి ఎటువంటి సమాచారం తన దగ్గర లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు.పొత్తుల అంశంపై నాదెండ్ల మనోహర్ ని అడగాలని సూచించారు.
అదేవిధంగా తాము వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నామని వెల్లడించారు.