అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి నిధి అగర్వాల్( Nidhhi Agerwal ).అయితే ఈ సినిమా ఈమెకు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.
ఇలా ఇస్మార్ట్ సినిమా ద్వారా వరుస అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందలేదని చెప్పాలి అయితే తాజాగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
పవన్ కళ్యాణ్ హీరోగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు( Hari Hara Veeru Mallu ) .క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటించే అవకాశాన్ని అందుకున్నారు.ఈ సినిమాలో నిధి అగర్వాల్ యువరాణిలా కనిపించబోతున్నారు.
అయితే నిధి అగర్వాల్ కెరియర్ లో పెద్దగా సక్సెస్ సాధించిన సినిమాలు లేకపోవడంతో చాలామంది తనకు నటన రాదంటూ తనపై ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా నటి నిధి అగర్వాల్ తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించారు.
ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్( Trolls ) పై స్పందిస్తూ…నటన విషయంలో పూర్తిగా అవగాహన లేని వారిలో తాను మాత్రమే కాదని, ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్కరికి నటన గురించి పూర్తి అవగాహన ఉండదని తెలియజేశారు.ప్రతి ఒక్కరూ సినిమా సినిమాకు నటన విషయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారని తాను కూడా ఇప్పుడిప్పుడే నటనలో ఎన్నో కొత్త విషయాలను మెలుకువలు నేర్చుకుంటున్నానని తెలియజేశారు.ఇకపై తాను కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని నటించబోతున్నట్లు ఈ సందర్భంగా నిధి అగర్వాల్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.