తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) గతంలో మద్రాసులో ఉండేది అనే విషయం మనందరికీ తెలిసిందే.మన తెలుగు దర్శకులు నిర్మాతలు నటీనటులు అంతా కూడా అవకాశాల కోసం చెన్నైకి వలస వెళ్లేవారు.
ఊరు కానీ ఊర్లో, మన భాష కాని చోట ఎన్నో కష్టాలు పడి అవకాశాలు దక్కించుకొని సెలబ్రిటీలుగా మారేవారు.దాదాపు మూడు నుంచి నాలుగు దశాబ్దాల పాటు మద్రాసులోనే సౌత్ ఇండియా సినిమాలు అన్నీ కూడా రూపుదిద్దుకునేవి.తమిళం, తెలుగు, కన్నడ భాషల వారు మద్రాసులోనే ఉండేవారు.అక్కడ స్టూడియోలలో సినిమా చిత్రీకరణలు జరిగేవి.ఇక స్టార్ల పిల్లలు కూడా చెన్నైలోనే తమ చదువును కొనసాగించేవారు.

అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్ కి ( Hyderabad ) తరలి రావాలి అని భావించిన మొట్టమొదటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు.( Akkineni Nageswara Rao ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకులను కలుపుకొని సినిమా తారలు అంతా మూకుమ్మడిగా హైదరాబాద్ కి మకాం మార్చారు.వారు హైదరాబాద్ రావడానికి సినిమాలకు సంబంధించిన టాక్స్ కూడా ఒక కారణం మన సినిమా, మన టాక్స్ మన రాష్ట్రానికే చెందాలని రాజకీయ నాయకులు సైతం కోరుకున్నారు.
అనుకున్నదే తడవుగా స్టూడియోలు నిర్మించబడ్డాయి.అలా కట్టుకుంటాను అన్న స్టార్ హీరోలు అందరికీ రాష్ట్రం తరఫున ప్రభుత్వ భూములను విరాళంగా ఇచ్చారు.అలా మెల్లిగా మన సినిమాలు అన్నీ కూడా మన చోటనే షూటింగ్ జరుపుకోవడం మొదలుపెట్టాయి.

వాస్తవానికి అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్ కి రావాలనుకోవడం వెనుక మరొక ముఖ్యమైన కారణం ఉంది ఆయన పెద్ద కుమారుడు పెద్ద కుమార్తను చర్చి స్కూల్లో చదివించారు అక్కడ వారు ఉత్తరాలు రాస్తే ఇంగ్లీషులో ఉండేవి.అవి చదివించాలంటే చదువుకున్న వారిని ఆశ్రయించాల్సి వచ్చేది.ఇంత పెద్ద చదువులు చదువుకున్న ఎన్ని భాషలు నేర్చుకున్న మాతృభాషను మర్చిపోకూడదు అని ఆయన అనుకోవడంతో హైదరాబాద్ కి వస్తే ఆ మాతృభాష కచ్చితంగా ఒక లాంగ్వేజ్ గా ఉంటుంది కాబట్టి వారు అది నేర్చుకునే అవకాశం ఉంటుంది అని కుటుంబంతో సహా హైదరాబాద్ కి వచ్చేసారు.







