తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై( Rajinikanth ) సంచలన విమర్శలు చేశారు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి.( Nandamuri Lakshmi Parvathi ) ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నిమిత్తం విజయవాడకు వచ్చిన రజనీకాంత్ ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబుపై అనేక ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు కారణంగానే తెలుగువారు ఐటీ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని, హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్ లా మారిందని ,
అందులో చంద్రబాబు( Chandrababu Naidu ) పాత్ర కీలకమని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఏపీ మరింతగా అభివృద్ధి చెందుతుంది అని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, ఇతర కీలక నాయకులు రజిని పై విమర్శలు చేశారు.
దీనిలో భాగంగానే లక్ష్మీపార్వతి కూడా రజనీకాంత్ పై విమర్శలు చేస్తూ.గతంలో చోటు చేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు.

ఎన్టీఆర్ గురించి ఇంకోసారి మాట్లాడితే ఊరుకోను అని హెచ్చరించారు.చంద్రబాబుతో కలిసి రజనీకాంత్ కూడా వెన్నుపోటు దారుడిగా మారారని మండిపడ్డారు.చంద్రబాబు గురించి చివరి రోజుల్లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు గురించి రజనీకాంత్ తెలుసుకోవాలని సూచించారు.ఎన్టీఆర్ ను పదవి నుంచి తప్పించే సమయంలో చంద్రబాబుకు రజనీకాంత్ అండగా నిలబడ్డారని , ఆ తరువాత తప్పు తెలుసుకుని ఎన్టీఆర్ ని కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారని లక్ష్మిపార్వతి గుర్తు చేశారు.

అప్పట్లో రజనీకాంత్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని , తమిళ మీడియా కూడా అప్పట్లో రజనీ కాంత్ వ్యవహరించిన తీరును తప్పు పట్టిందని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.ఇక రజనీకాంత్ ద్వారా టిడిపి అధినేత చంద్రబాబు బిజెపికి దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.జగన్ కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు సినిమా హీరోలను తీసుకువచ్చి ఈ విధంగా కొత్త డ్రామాలు ఆడుతున్నారని , దానిలో భాగంగానే రజినీకాంత్ ను తీసుకొచ్చి పొగిడించుకున్నారని ఎద్దేవా చేశారు.







