అఖిల్‌ తర్వాత సినిమా.. ఆ తప్పు జరగకుండా జాగ్రత్త

అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) హీరోగా రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్( 80 Croroe Budget ) తో రూపొందిన ఏజెంట్ కనీసం రూ.8 కోట్ల షేర్ రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మొదటి రెండు రోజుల్లోనే సినిమా కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి.

 Akhil Akkineni Movie Agent News,akhil Akkineni,agent Movie,surendar Reddy,akkine-TeluguStop.com

ఆదివారం కాస్త పరవాలేదు అన్నట్లుగా ఉండే అవకాశం ఉంది.

రేపటి నుండి అంటే సోమవారం నుండి జీరో కలెక్షన్స్ నమోదు అవుతాయేమో అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇంతటి దారుణం పరాజయం కి కారణం ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానం చెబుతున్నారు.సినిమా మరీ డిజాస్టర్( Disaster ) గా ఏమీ లేదు.

ఒక మోస్తరుగా చూడడానికి వీలుగానే ఉంది అంటూ కొందరు ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంచనాలు లేకుండా సినిమా కు వెళ్తే తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది కానీ భారీ అంచనాలు పెట్టుకొని ఏజెంట్ సినిమా కి వెళ్తే మాత్రం కచ్చితంగా నిరాశ పరుచుతుంది అంటూ కొందరు రివ్యూలు ఇచ్చారు.

ఏజెంట్ ఫ్లాప్‌( Agent Movie ) కారణాల్లో అదే ఎక్కువగా కనిపిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.80 కోట్ల రూపాయల బడ్జెట్ తో రెండు సంవత్సరాల పాటు రూపొందించిన సినిమా అంటూ ఏజెంట్ ని తెగ ప్రమోట్ చేయడం జరిగింది.తీరా చూస్తే సినిమా ఆ స్థాయిలో లేదు అంటూ అభిమానులు పెదవి విరుస్తున్నారు.అందుకే అఖిల్ తదుపరి సినిమా విషయంలో అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బడ్జెట్ 30 నుండి 40 కోట్లకు మించకుండా అంచనాలు ఆకాశాన్ని తాకకుండా ఒక మోస్తరు సినిమా అన్నట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని తద్వారా ప్రేక్షకుల్లోకి సినిమా వెళ్తుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అఖిల్ తదుపరి సినిమా ఏంటి ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube