విదేశాలకు వెళ్లేవారికి ఇది ఓ మంచి శుభవార్త అని చెప్పుకోవాలి.తెలంగాణలో ఆరోజునుండి అనగా ఏప్రిల్ 29 నుంచి ప్రత్యేకంగా పాస్‌పోర్టు డ్రైవ్( Passport Drive ) నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి అయినటువంటి దాసరి బాలయ్య తెలిపారు.
ప్రస్తుతం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండడంతో డిమాండ్ అధికంగా ఉందని, ఈ నేపథ్యంలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు దాసరి బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట, టోలీచౌక్ లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.అంతేకాకుండా కరీంనగర్, నిజామాబాద్‌లలో కూడా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు దాసరి బాలయ్య చెప్పుకొచ్చారు.ఈ నెల 29వ తేదీన మొదలైన ఈ ప్రత్యేక డ్రైవ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుందని దాసరి బాలయ్య అన్నారు.
ఈ డ్రైవ్ లో భాగంగా సాధారణ, తత్కాల్, పీసీసీ క్యాటగిరిలకు చెందినటువంటి 3056 అపాయింట్‌మెంట్లను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదల చేశామని దాసరి బాలయ్య తెలిపారు.

ఇకపోతే, ఈ సందర్భంగా ఆయన ఓ విషయాన్ని ప్రస్తావించారు.అదేమంటే ఇప్పటికీ అపాయిట్మెంట్లు దొరకక పెండింగ్‌లో ఉన్న 3056 అపాయింట్‌మెంట్లుకు చెందిన ధరఖాస్తుదారులు 29వ తేదీన స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.తాజా సర్వేల ప్రకారం, ముఖ్యంగా మన దేశంనుండి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.
లాస్ట్ రెండు సంవత్సరాలలో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండింతలు ఎక్కువగా జనం అమెరికా వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.







