ఎవరైనా సరే వారికి లేదా వారి ఫ్యామిలీకి ఏదైనా ఒక హోదా వస్తే వెంటనే వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది.ఒకేసారి తమ ప్రవర్తన కూడా మారిపోతుంది.
ఎందుకో తెలియదు హోదా రాగానే మనిషిలో మార్పు రావడం అనేది.బహుశా ఆ హోదానే వారి మనస్తత్వం కూడా మారుస్తుందేమో.
అలా సామాన్యులే కాదు ఒక హోదాకు చెందిన వాళ్లు కూడా అలాగే తయారవుతారు.
అయితే అటువంటిదే ఈమధ్య బన్నీ భార్య స్నేహ రెడ్డి లో( Sneha Reddy ) కూడా కనిపిస్తుంది.
టాలీవుడ్ లో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.( Allu Arjun ) అది కూడా పుష్ప సినిమాతో.ఈ సినిమాతో ఈయన క్రేజ్ మొత్తం మారిపోయింది.అప్పటివరకు కేవలం స్టార్ హీరోగా మాత్రమే ఉన్నాడు.
ఇక ఎప్పుడైతే ఈయన కూడా పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్లాడో అప్పటినుంచి ఆయన భార్య స్నేహారెడ్డి లో కూడా బాగా మార్పు కనిపించింది.
అవును ఇది నిజమే.బన్నీని పెళ్లి చేసుకున్నప్పటినుంచి స్నేహ రెడ్డి కొంతవరకు పద్ధతిగానే కనిపించింది.ఎక్కడ కూడా ఆమె షో చేసినట్లు అంతగా అనిపించలేదు.
అయితే పుష్ప సినిమా( Pushpa ) తర్వాత తన భర్త పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకోవడంతో ఈమె కూడా పాన్ ఇండియా స్టార్ భార్య ఇలా ఉంటుంది అన్నట్లు మారిపోయింది.
ఇక అప్పటినుంచి పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను బయటపెట్టేస్తుంది.
పైగా బన్నీ సపోర్ట్ కూడా ఉండటంతో రెక్కలు వచ్చిన పక్షి లాగా మారిపోయింది.అసలు ఎక్కడ కూడా తగ్గట్లేదు స్నేహ రెడ్డి.
దీంతో చాలామంది ఈమె పై నెగిటివ్గా కామెంట్ చేశారు కూడా.అప్పుడే రూటు మార్చేసావా అంటూ ఒకప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంటే గౌరవం ఉంటుంది అంటూ కామెంట్లు కూడా చేశారు.
అయితే కేవలం ఒక అల్లు అర్జునే కాదు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా హీరోలుగా మారారు.ఇక వాళ్ళు గ్లోబల్ స్టార్ అని టాగ్ ను కూడా సొంతం చేసుకున్నారు.కానీ వీళ్ళ భార్యలల్లో మాత్రం మార్పు రాలేదు.నిజానికి వాళ్లు కూడా అలాగే తయారవ్వాలి.కానీ వాళ్లు అలా లేరు.ఉపాసన కూడా ఒక పెద్దింటి కూతురే.
పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టిందని చెప్పాలి.
అటువంటి ఫ్యామిలీ నుండి వచ్చినామే ఏరోజు కూడా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.
తన భర్త గ్లోబల్ స్టార్ గా మారినా కూడా తనలో ఎటువంటి మార్పు కనిపించలేదు.ఎప్పుడు నిండు గానే బట్టలు వేసుకుంటూ ఉంటుంది.ఇక ఎన్టీఆర్ భార్య ప్రణతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కనీసం సోషల్ మీడియాలో కూడా ఈమె కనిపించదు అంటే ఆమె వ్యక్తిత్వం ఎటువంటిదో చెప్పవచ్చు.
ఈమె కూడా ఏ రోజు గ్లామర్ షో చేయలేదు.చాలావరకు పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది.అలా ఈ ముగ్గురు హీరోల భార్యలలో స్నేహారెడ్డి లోనే మార్పు రావడంతో ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు.దీంతో హోదాను చూపించడమే కాదు షో చేయటం కూడా స్నేహ రెడ్డికి ఇష్టం అని అర్థమవుతుంది.