రజనీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుందన్న రోజా.. రికార్డులు పంపిస్తానంటూ?

వైసీపీ మంత్రి రోజా( Minister Roja ) ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితమయ్యారు.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో రజనీకాంత్( Rajinikanth ) చేసిన కామెంట్ల గురించి రోజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Minister Rk Roja Counter Attack Super Star Rajinikanth Comments Details, Rajanik-TeluguStop.com

మంత్రి రోజా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) రజనీకాంత్ చేత అబద్ధాలు చెప్పించారని ఆమె తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలను రజనీకాంత్ కు పంపిస్తానని రోజా కామెంట్లు చేశారు.

చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించారని రోజా అన్నారు.

తెలుగు రాష్ట్రాల గురించి, ఇక్కడి రాజకీయాల గురించి రజనీకాంత్ కు సరైన అవగాహన లేదని ఆమె కామెంట్లు చేశారు.రజనీకాంత్ చేసిన కామెంట్లు వింటే సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ సైతం బాధ పడుతుందని రోజా అభిప్రాయపడ్డారు.

రజనీ కామెంట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను బాధ పెట్టాయని ఆమె తెలిపారు.

తెలుగువాళ్లకు విదేశాల్లో ఉద్యోగాలు రావడానికి వైఎస్సార్ కారణమని చంద్రబాబు కాదని ఆమె తెలిపారు.వైఎస్సార్ ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ ను అమలులోకి తెచ్చారని రోజా చెప్పుకొచ్చారు.విజన్ 2020 వల్లే తెలుగుదేశంకు 2019 ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయని రోజా ఎద్దేవా చేశారు.

సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఆమె చెప్పుకొచ్చారు.అసెంబ్లీలో ఎన్టీఆర్ కు ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయో రజనీకాంత్ కు రికార్డులు పంపిస్తానని రోజా కామెంట్లు చేశారు.2024 సంవత్సరంలో చంద్రబాబు సీఎం అవుతారని రజనీకాంత్ చెప్పారని అలా జరిగే పరిస్థితి లేదని రోజా కామెంట్లు చేశారు.రోజా వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.టీడీపీ నేతల విషయంలో వైసీపీ మంత్రి రోజా ఒకింత ఘాటుగానే విమర్శలు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube