ప్రస్తుత వేసవి కాలంలో విరివిరిగా లభ్యమయ్యే ఫ్రూట్స్ జాబితాలో పుచ్చకాయ( Water Melon ) ఒకటి.వాటర్ కంటెంట్ తో వివిధ రకాల పోషకాలను కలిగి ఉండే పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పుచ్చకాయ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.వేసవి తాపాన్ని తీరుస్తుంది.
వడ దెబ్బ తగలకుండా రక్షిస్తుంది.అంతేకాదు పుచ్చకాయను డైట్ లో చేర్చుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
నీరసం అలసట వంటివి పరార్ అవుతాయి.కిడ్నీలో రాళ్లు ఉంటే కరుగుతాయి.
రక్తపోటు అదుపులో ఉంటుంది. వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.
హెయిర్ గ్రోత్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.
ఇన్ని ప్రయోజనాలు అందిస్తుంది కాబట్టే పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ పుచ్చకాయ తీసుకునే విధానంలో కొందరు పొరపాట్లు చేసి లేనిపోని సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు.నిజానికి పుచ్చకాయతో కొన్ని కొన్ని ఆహారాలు కలిపి పొరపాటున కూడా తీసుకోకూడదు.ఆ ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ-పాలు( Water Melon- Milk ):
ఈ రెండింటి కాంబినేషన్ చాలా వరస్ట్ అని చెప్పవచ్చు.పాలు పుచ్చకాయ కలిపి లేదా వెంట వెంటనే పొరపాటున కూడా తీసుకోరాదు.పాలలో ఉండే ప్రోటీన్ ఆమ్ల పండ్లతో కలిస్తే జీర్ణ సమస్యలు వస్తాయి.అందువల్ల పాలు పుచ్చకాయ కలిపి తింటే లూజ్ మోషన్స్( Loose Motions ), గ్యాస్, కడుపు నొప్పి మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
పుచ్చకాయ-గుడ్డు( Water Melon- Egg ):
ఈ రెండిటిని ఒకేసారి అసలు తీసుకోకండి.గుడ్డులో ప్రోటీన్, ఒమేగా -3 ( Omega 3 )వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.అయితే పుచ్చకాయలో నీరు అధికంగా ఉంటుంది.
ఈ రెండిటిని ఒకేసారి తీసుకుంటే ఒకదానికొకటి జీర్ణం కాకుండా నిరోధిస్తాయి.దాంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కాబట్టి పుచ్చకాయ గుడ్డు తీసుకునేటప్పుడు రెండిటికి మధ్య ఓ గంటన్నర గ్యాప్ ఉండేలా చూసుకోండి.
అలాగే పుచ్చకాయ తో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను పొరపాటున కూడా తీసుకోరాదు.
ఇలా చేస్తే జీర్ణ ఎంజైమ్‌లు దెబ్బతింటాయి.ఇక పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగడం వల్ల మీ జీర్ణాశయ పేగులు ప్రభావితం అవుతాయి.
సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియా( bacteria ) అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ.పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే ఎసిడిటీ కూడా వస్తుంది.
కాబట్టి పొరపాటున కూడా పుచ్చకాయ తీసుకున్న వెంటనే నీరు తాగకండి.