దీనిని బర్గర్ కింగ్ అనాలా? లేదంటే, పాన్ కింగ్ అనాలా? అదికాదంటే పాన్ బర్గర్( Burger Pan ) అని పేరుపెట్టాలో మాకైతే అర్ధం కావట్లేదు కానీ, మీకు అర్ధమైతే కాస్త చెప్పండి అని నెటిజన్లు అడుగుతున్నారు.అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రెసిపీ తాలూక వీడియోని చూసిన పాన్ ప్రియుల హృదయం చివుక్కుమంది.
ఇక దానికి కారణం తెలియాలంటే మీరు ఈ మేటర్ మొత్తం చదవాల్సిందే.
సోషల్ మీడియాలో( Social Media ) రావడం వలన విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు అంటూ రకరకాల రెసిపీల వీడియోలు వైరల్ కావడం కామనైపోయింది.
కాబట్టి ఇపుడు ఈ ఈ కాంబో కూడా చూద్దాం.ఇక్కడ పాన్ ప్రియులు( Pan Lovers ) చాలామంది ఉంటారు.అదే విధంగా బర్గర్( Burger ) అంటే పడి చచ్చిపోయే యువత కూడా అనేకమంది వున్నారు.అయితే ఇపుడు ఈ రెండు కలిపి తినడమంటేనే ఎలావుంటుంది? కాస్త మింగుడు పడట్లేదు కదా.అయితే ఇదే ఐడియా వచ్చి ఓ షాపు ఓనర్ కి.ఆలోచన వచ్చిందే తడవుగా దానిని షురూ చేసాడు.అంతే, కస్టమర్లు వాటిని కూడా ఎగబడి కొంటున్నారు మరి.

ఇక్కడ వీడియో చూస్తేనే మీకు అర్ధం అయిపోతుంది.‘మేరా అప్నా పంజాబ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘బర్గర్ పాన్ (ఘనీ పాన్ షాప్)’ అనే శీర్షికతో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఓ వ్యక్తి పాన్ బర్గర్ పాన్ తయారు చేస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతోంది.ముందుగా బన్ను దానిపై తమలపాకు ఉంచి,

దాని మీద డ్రై ఫ్రూట్స్, సోంపు, బాదం, చాక్లెట్లు ఇంకా కొన్ని స్వీట్ ఐటమ్స్ వేసి మయోనైస్‌కు బదులు క్రీమ్ కూడా దానికి పుసాడు.చివర్లో పైన మరో బన్నును చేర్చాడు.అంతే పాన్ బర్గర్ రెడీ.ఇక దీనిని చూసిన కొందరు నెటిజన్లు ఈ కాంబోలు చూస్తే నిజంగా పాన్, బర్గర్ ఇష్టపడేవారు రోత పుట్టేలా ఉందని వాపోతున్నారు.







