నేటి ఆధునిక యుగంలో ట్రెండ్ అనేది కొత్తపుంతలు తొక్కుతోంది.దీనికి ఆకర్షితులైన జనాలు తమతమ కర్తవ్యాలను మరిచి తమకు కనబడినదే ఫ్యాషన్ అనుకొని ఓ పిచ్చి భ్రమలో బతుకుతున్నారు.
అందులోనుండి పుట్టుకొచ్చినదే టాటూ.అవును, దీనికి ఇపుడు చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆకర్షితులు అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ దారుణం చోటుచేసుకుంది.కన్నతల్లి, సవతి తండ్రి చేసిన ఘోరం ఇపుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది.

చిన్న పిల్లలను తల్లి దండ్రులు అనేవారు ఎలా చూసుకుంటారు? ప్రతిక్షణం వారిని అంటిపెట్టుకొని కాపాడుతూ వుంటారు.ఈ క్రమంలో వారికి ఏ చిన్న ముళ్ళు గుచ్చుకున్నా వారి హృదయానికి గాయం అవుతుంది.అలాంటిది ఇక్కడ కన్నతల్లి, సవతి తండ్రి ముసుగులో వున్న ఇద్దరు వారి పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.అవును, ఇద్దరు పిల్లలకు ఇష్టం లేకుండా బలవంతంగా టాటూలు( Tatoo ) వేయించారు.
అక్కడితో ఆగకుండా వాటిని చెరిపేసేందుకు కూడా యత్నించారు.

దానికోసం ఘోరానికి తెగబడ్డారు.ఏకంగా చిన్నారుల చర్మాన్ని( Skin ) కత్తిరించారు.ఈ ఘటన అమెరికాలో జరగగా తాజాగా వెలుగు చూసింది.
టెక్సాస్( Texas ) కు చెందిన గన్నర్ ఫార్ అనే మహిళకు 5, 9 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు.సదరు మహిళ భర్తకు డైవర్స్ ఇచ్చి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది.
అయితే ఈ చిన్నారులకు వీరిద్దరు టాటూలు వేయించాలని డిసైడ్ అయ్యి, వారిని వేసుకోమని బలవతం చేసారు.

పిల్లలు అరవడంతో వారిని తాడుతో కట్టేశారు.నోట్లో దుస్తులు కుక్కి, కళ్లకు గంతలు కట్టిమరీ అనుకున్నపని చేసారు.సరిగ్గా అదే సమయంలో పిల్లలను చూడటానికి మహిళ మొదటి భర్త రాగా ఈ దారుణం వెలుగు చూసింది.
దాంతో అతగాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితులిద్దరి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.







