రైలులోఖాళీ సీటు ఎక్కడుందో ఇలా తెలుసుకోండి!

దేశంలో దాదాపుగా అందరూ రైలు మార్గంలోనే పయనించాలని అనుకుంటారు.ఎందుకంటే టికెట్ ధరలు తక్కువ పైగా సౌకర్యవంతం.

 Find Out Where Is The Empty Seat In The Train! Railway, Station, Department, Irc-TeluguStop.com

ట్రైన్ జర్నీ( Train journey )లో వున్న సౌకర్యం మరే ఇతర జర్నీలో కూడా ఉండదని చెప్పుకోవాలి.అందుకే ఇక్కడ అన్ని తరగతులవారు రైలు పయనానికే ఓటు వేస్తారు.

అయితే ఆ ప్రయాణంలో వున్న ఆనందం మనకు సీటు దొరికినపుడు మాత్రమే ఉంటుంది.సీటులేకుండా జనరల్ బోగీల్లో పయనించేవారికి ప్రత్యక్ష నరకం కనబడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

అవును, చాలామంది అర్జెంటుగా పయనమయ్యేవారు రిజర్వేషన్( Reservation ) లేకుండా జెనరల్ బోగీలలో పయనించేవారు ఆ క్షణానికి కనబడిన బోగీని ఎక్కి అందులో ఇబ్బందులు పడుతూ వుంటారు.ఈ క్రమంలో చాలామంది టీటీఈ చుట్టూ సీటుకోసం తిరుగుతూ వుంటారు.అయితే ఇపుడు మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఖాళీ బెర్త్ లేదా సీటు మీకు కావాలంటే మీరు టీటీఈ లేదా టీసీ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.ఏ కోచ్‌లో బెర్త్ అందుబాటులో ఉందో మొబైల్( Mobile ) ద్వారానే సులువుగా తెలుసుకోవచ్చు.

IRCTC యాప్ సహాయంతో ప్రయాణికులు రైలులో ఖాళీగా ఉన్న బెర్త్ లేదా సీటు గురించి వివరాలు తెలుసుకోవచ్చు.దానికోసం ముందుగా యాప్ ఓపెన్ చేసి ట్రైన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆ తర్వాత చార్ట్ ఎంప్టీ ఐకాన్ పై క్లిక్ చేస్తే రైలు పేరు, నంబర్, బోర్డింగ్ స్టేషన్, తేదీని అని వస్తుంది.అవి నమోదు చేసాక రైలులో సీటు లేదా బెర్త్ అందుబాటులో ఉంటే, దాని వివరాలు ఇక్కడ కనిపిస్తాయి.

ఏ కోచ్ లేదా ఏ క్లాస్‌లో ఎన్ని బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయో కూడా మీరు ఇక్కడ పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్‌కి సైన్ ఇన్ కావలసిన అవసరం కూడా లేదు.

IRCTC New Feature: Check Vacant Train Seats

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube