తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ( Congress party ) కి వరుసగా ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పడం లేదు.రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తెలంగాణ లో పాజిటివ్ సెంటిమెంటు కలిగి ఉండి అధికారాన్ని దక్కించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రెండు సార్లు వరుసగా ఓటమిపాలైంది.
మూడో సారైనా తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకుంటుందా అంటే కష్టమే అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సీఎం అభ్యర్థి అవ్వడం వల్లే ఈ పరిస్థితి దాపరించింది.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కి ఏ ఒక్క సీనియర్ నేత సహకరిస్తున్నట్లుగా కనిపించడం లేదు.అధిష్టానం ఆదేశం మేరకు అప్పుడప్పుడు ఆయన తో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కూడా ఎక్కువ శాతం ఆయన కార్యక్రమాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
ఆయన వ్యక్తిగతంగా చేయాలనుకుంటున్న కార్యక్రమాలకు అస్సలు మద్దతు ఇవ్వడం లేదు.

ఇటీవల ఒక సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అంటే అధికారం దక్కితే పార్టీ అధిష్టానం దృష్టి లో తాను కూడా సీఎం క్యాండిడేట్ నే అంటూ వ్యాఖ్యలు చేశాడు.ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని కార్యకర్తలు మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ( BRS )తామే అసలైన పోటీ అంటూ బిజెపి దూసుకు పోయే ప్రయత్నం చేస్తుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పడిపోతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని మినిమం గా అయిన జనాల్లోకి తీసుకుపోయే బాధ్యత నా పార్టీ నాయకులు ఉంది.
కానీ వారు మాత్రం అధికారంలోకి వచ్చింది లేకపోతే సీఎం నేనే అంటూ ప్రకటనలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరో ఒకరు సీఎం అవుతారు.
ఆ విషయాన్ని పక్కన పెట్టి పార్టీ జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా వ్యవహరించాలని పార్టీ అధిష్టానం కాంగ్రెస్ నాయకులను హెచ్చరించాల్సిన అవసరం ఉంది.







